కీర్తి శిఖరం
మహాలయ వచ్చింది పితృపక్షాలను తెచ్చింది స్మృతి పథాన్ని కదిపింది ఆశీస్సులను కురిపించింది
అమావాస్య!
మహాలయ వచ్చింది
పితృపక్షాలను తెచ్చింది
స్మృతి పథాన్ని కదిపింది
ఆశీస్సులను కురిపించింది
అలాగే!!
బొడ్డెమ్మ పీఠమెక్కింది
బతుకమ్మకు స్వాగతం పలికింది
ఆడపడుచులకు కబురు చేసింది
పుట్టినిల్లు శోభలతో నింపింది
ప్రకృతి మాత పరవశించింది
రంగు రంగుల పూలతో కొలువైంది
బతుకమ్మగా పుడమిలో వెలిసింది
ధనిక పేద అనే భావాన్ని చెరిపేసింది
సద్దులతో కళకళలాడుతూకనువిందైంది
గ్రామ గ్రామాన మహిళా
లోకం ఉప్పొంగింది
ఉయ్యాల పాటలతో
ఉర్వి ఊయలూగింది
తిరిగి ..
బతుకమ్మ చెరువున
నిమజ్జన గమ్యం చేరింది
ప్రతి ఏడాది ఇలాగే వస్తుంది
ఆనంద పారవశ్యాన్ని నింపుతుంది
అహంకారాన్ని అణచి
వేడుక జరుపుతుంది
బతుకమ్మ గౌరమ్మగా కీర్తి శిఖరమైంది.
-నమిలకొండ నాగేశ్వరరావు
86885 53470
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burns crop | నీళ్లు లేక కరెంట్ రాక..సూర్యాపేట జిల్లాలో పంటను కాలబెట్టిన కౌలు రైతు
AP News | తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం.. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు..!
Ishan Kishan | ఇషాన్ కిషన్ కోలుకుంటున్నాడు.. అయినా మూడో టీ20కి దూరం.. బీసీసీఐ కీలక ప్రకటన!
Gulam Nabi Azad | భారత్‌తోపాటు కశ్మీర్ ప్రజలకూ పాకిస్థాన్ శత్రువే : గులాం నబీ ఆజాద్
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

