Cab booking : క్యాబ్ బుక్ చేసుకున్నాక డ్రైవర్ రైడ్ క్యాన్సిల్ చేస్తున్నాడా? అయితే ఇలా చేయండి
క్యాబ్ బుక్ చేసుకున్నాక డ్రైవర్ రైడ్ క్యాన్సిల్ చేస్తున్నాడా? | ఈరోజుల్లో క్యాబ్ బుక్ చేయడం అనేది సర్వసాధారణం. ఎందుకంటే..
ఈరోజుల్లో క్యాబ్ బుక్ చేయడం అనేది సర్వసాధారణం. ఎందుకంటే.. ఎక్కడికి వెళ్లాలన్నా కంపల్సరీ ఏదో ఒక వాహనం ఉండాల్సిందే. సొంత వాహనాలు లేనివాళ్లు.. ఖచ్చితంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదంటే క్యాబ్‌లు, ఆటోలను ఆశ్రయించాల్సిందే. అయితే.. కొందరు క్యాబ్ డ్రైవర్లు క్యాబ్ బుక్ చేసుకున్న తర్వాత కూడా ఇరిటేట్ చేస్తుంటారు. వెంటనే రారు. రైడ్ కన్ఫమ్ అయ్యాక కూడా ఒక్కోసారి రైడ్‌ను క్యాన్సిల్ చేస్తుంటారు. దాని వల్ల మరోసారి క్యాబ్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. సమయం వృథా అవుతుంది. ఒక్కోసారి రైడ్ క్యాన్సిల్ అయినందుకు ఫైన్ కూడా చెల్లించాల్సి ఉంటుంది.

ఇంకొందరు డ్రైవర్లు అయితే.. ఎక్కువ దూరం ఉన్నా.. ఆన్లైన్ పేమెంట్ చేసినా రైడ్ క్యాన్సిల్ చేస్తుంటారు. అలా చిన్న చిన్న కారణాలతో రైడ్‌ను డ్రైవర్ క్యాన్సిల్ చేస్తే వాళ్లు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఇటువంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే ఈ చిట్కా పాటిస్తే చాలు.. ఇంకోసారి మీ క్యాబ్ డ్రైవర్.. అస్సలు రైడ్ క్యాన్సిల్ చేయడు.
మీరు క్యాబ్ బుక్ చేశాక.. మీ బుకింగ్ కన్ఫమ్ అయ్యాక కూడా క్యాబ్ డ్రైవర్ రైడ్‌ను క్యాన్సిల్ చేశాడని అనుకుందాం. అందుకని… మీ బుకింగ్ కన్ఫమ్ కాగానే.. క్యాబ్ డిటెయిల్స్‌ను స్క్రీన్ షాట్ తీయండి. అందులో క్యాబ్ నెంబర్ కూడా ఉండాలి. యాప్‌లో క్యాబ్ బుకింగ్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ తీసి దాన్ని మీ సిటీలోని ట్రాఫిక్ పోలీస్ ట్విట్టర్ ఖాతాలో కానీ.. వాట్సప్ ఖాతాలో కానీ షేర్ చేయండి. స్క్రీన్ షాట్‌తో పాటు మీ డెస్టినేషన్, బండి నెంబర్, డేట్, టైమ్, లొకేషన్.. అన్ని వివరాలను షేర్ చేయండి.
ఆ క్యాబ్ నెంబర్‌ను ట్రాక్ చేసి.. ఆ కారుకు ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారు. ఎందుకంటే.. ఒకసారి ప్యాసెంజర్ క్యాబ్ బుక్ చేసుకున్నాక.. దాన్ని క్యాన్సిల్ చేయడం చట్టరిత్యా నేరం. మోటార్ వెహికిల్స్ యాక్ట్ 1988లోని 178 వ సెక్షన్ ప్రకారం ఆ రైడ్‌ను క్యాన్సిల్ చేసిన క్యాబ్ డ్రైవర్‌కు ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధిస్తారు. దీంతో ఇంకోసారి ఆ డ్రైవర్ మరో రైడ్‌ను క్యాన్సిల్ చేయడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
YouTuber : ఫిజిక్స్ ప్రశ్నకు సమాధానం కోసం.. ఈ యూట్యూబర్ ఏం చేశాడంటే..?!
Bhongir Fort | తెలంగాణలో ట్రెక్కింగ్‌కు కేరాఫ్ భువనగిరి కోట.. దాని ప్రత్యేకతలు తెలుసా?
20 కోట్ల విలువైన డైమండ్ రింగ్ చెత్త బుట్టలో వేయబోయింది.. కానీ
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

