Pixies curtis | పదేళ్ల వయస్సులోనే నెలకు రూ.కోటి సంపాదిస్తున్న పాప!
Pixies curtis | జీవితంలో ప్రతిఒక్కరు తమ పిల్లలు పెద్దవరై ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆశిస్తారు. కానీ అస్ట్రేలియాకు చెందిన రాక్సీ జాసెంకో(42) అనే మహిళ తన కూతురు బాల్యంలోనే పెద్ద వ్యాపారవేత్త కావాలని కృషి చేసింది. ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించి ప్రస్తుతం ఆమె 10 ఏళ్ల కూతురు లకు రూ.కోటి పైగా సంపాదిస్తోంది

జీవితంలో ప్రతిఒక్కరు తమ పిల్లలు పెద్దవరై ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆశిస్తారు. కానీ అస్ట్రేలియాకు చెందిన రాక్సీ జాసెంకో(42) అనే మహిళ తన కూతురు బాల్యంలోనే పెద్ద వ్యాపారవేత్త కావాలని కృషి చేసింది. ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించి ప్రస్తుతం ఆమె 10 ఏళ్ల కూతురు పిక్సీ చిన్నపిల్లల మేకప్, బొమ్మలు విక్రయించే వ్యాపారం చేస్తోంది. ఆ వ్యాపారం ద్వారా నెలకు రూ.కోటి పైగా సంపాదిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. పిక్సీ కర్టిస్ అనే 10 ఏళ్ల చిన్నారి ఆస్ట్రేలియాలోని సిడ్నీలో విజయవంతంగా బిజినెస్ చేస్తోంది. దీనికి కారణం అమె తల్లి రాక్సీ జాసెంకో. పిక్సీ పుట్టగానే ఆమె పేరు మీద రాక్సీ 2011లో పిక్సీస్ బౌస్ అనే వ్యాపారం ప్రారంభించింది. ఆ తర్వాత పిక్సీస్ ఫిడ్జెట్స్ అనే మరో వ్యాపారం కూడా ప్రారంభించింది. ఇప్పుడు ఇవి విజయవంతంగా సాగుతున్నాయి.
పిల్లల బొమ్మలు, పిల్లలకు అవసరమయ్యే స్టేషనరీ, సరదా గాడ్జెట్స్ వంటివి అమ్ముతుంది. కొత్తగా వచ్చే బొమ్మలకు రివ్యూ ఇస్తుంది. అవి ఎలా వాడాలో, వాటి ధర ఎంతో, ఏ వయసు వారికి బాగుంటాయో చెబుతుంది. ఇలా చిన్నప్పటి నుంచే వ్యాపారంలో కిటుకులు తెలుసుకున్న పిక్సీ ఇప్పుడు నెలకు రెండు వ్యాపారాల ద్వారా కోటి రూపాయల దాకా సంపాదిస్తోంది.
పిక్సీకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. దానికి 90వేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. నాలుగేళ్ల కిందట.. ఆరేళ్ల వయసప్పుడే ఈ చిన్నారి ఇన్‌స్టాగ్రామ్‌లో స్పాన్సరింగ్ యాడ్ కోసం నాలుగున్నర లక్షలు తీసుకుంది. తన కూతురి సక్సెస్ గురించి రాక్సీ మాట్లాడుతూ.. “నేను 14 ఏళ్ల వయసులో మెక్ డొనాల్డ్స్‌లో వెయిటర్ పనిచేసేదాన్ని.. కానీ నా కూతురు 10 ఏళ్లకే తన పేరు మీద బిజినెస్ రన్ చేస్తోంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే.. పిక్సీ తలుచుకుంటే 15 ఏళ్లకే రిటైర్ అయి తన జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించవచ్చు” అని చెప్పింది.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

