ఒకప్పుడు స్కూల్ డ్రాప్ అవుట్.. ఇప్పుడు మల్టీ మిలియనీర్.. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా?
ఒకప్పుడు స్కూల్ డ్రాప్ అవుట్.. ఇప్పుడు మల్టీ మిలియనీర్ | బాగా చదువుకుంటేనే పెద్దయ్యాక ఉద్యోగం వస్తుంది.. ఇదే కదా.. పిల్లలకు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నూరిపోసేది.
బాగా చదువుకుంటేనే పెద్దయ్యాక ఉద్యోగం వస్తుంది.. ఇదే కదా.. పిల్లలకు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నూరిపోసేది. చదువుకోకపోతే జీవితమే లేదు అన్నట్టుగా కొందరు పేరెంట్స్ తమ పిల్లలకు చెబుతుంటారు. కానీ.. అక్షరం ముక్క రాకపోయినా.. ప్రపంచాన్ని ఏలిన వాళ్లు కోకొల్లలు. కోటీశ్వరులు అయిన వాళ్లు కోకొల్లలు. ప్రపంచ ఖ్యాతి గడించిన వాళ్లు కోకొల్లలు. అలాంటి వాళ్లలో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి కూడా ఉన్నాడు. అతడే యూకేలోని యోర్క్‌షైర్‌కు చెందిన స్టీవ్ పార్కిన్.

స్టీవ్.. 16 ఏళ్లకే చదువు మానేశాడు. చదువు అంతగా అబ్బలేదు. దీంతో 1992లో హెవీ గూడ్స్ వెహికిల్ లైసెన్స్ సంపాదించి డ్రైవర్‌గా పనిచేయడం మొదలు పెట్టాడు. ఓ బట్టల కంపెనీ వాహనానికి మొదటిసారి డ్రైవర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత మరో పని.. ఇంకో పని.. ఇలా బతకడం కోసం కొన్ని సంవత్సరాల పాటు ఏ పని దొరికితే ఆ పని చేశాడు. మొత్తానికి వ్యాపారం మొదలు పెట్టడానికి కావాల్సిన అనుభవాన్ని సంపాదించుకొని.. క్లిప్పర్(Clipper) అనే లాజిస్టిక్ కంపెనీని స్థాపించాడు.
గత సంవత్సరం ఆ కంపెనీ 45 మిలియన్ పౌండ్ల లాభాలను గడించింది. అంటే మన కరెన్సీలో రూ.450 కోట్లు అన్నమాట. అంతే కాదు.. ప్రస్తుతం యోర్క్‌షైర్‌లో ఉన్న టాప్ 10 అత్యంత ధనవంతులలో ఒకరిగా నిలిచాడు.
కోవిడ్ 19 వల్ల ప్రపంచమంతా స్థంభించిపోయినా.. ఇళ్లలో చిక్కుకుపోయిన ప్రజల కోసం.. కావాల్సిన వస్తువులను పంపించి తన కంపెనీ వాల్యూను ఒక్కసారిగా పెంచేసుకున్నాడు స్టీవ్. అందుకే.. ఈ సమ్మర్లోనే కంపెనీ టర్నోవర్ 39.1 శాతం పెరిగిందట. దీంతో తన కంపెనీ విలువ కూడా 700 మిలియన్ పౌండ్లకు పెరిగింది. మరో 2000 మంది ఉద్యోగులను నియమించుకున్నాడు. మొత్తం మీద ఇప్పుడు తన కంపెనీలో 10 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 10 శాతం కంపెనీ షేర్స్ అమ్మి.. 2 మిలియన్ పౌండ్ల డబ్బులను వెనకేసుకున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
కోడి ముందా? గుడ్డు ముందా? ఆన్సర్ దొరికేసిందోచ్.. ఏది ముందో సైంటిస్టులు తేల్చేశారు
బయటపడ్డ 4500 ఏళ్ల క్రితం నాటి సూర్యదేవాలయం.. ఎక్కడో తెలుసా?
Bull : ఈ ఎద్దు విలువ రూ. కోటి.. కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఆ బామ్మ వయసు 105 ఏళ్లు.. అయినా పరుగుపందెంలో పాల్గొని ప్రపంచ రికార్డు సృష్టించింది
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

