కెనడాలో ఘనంగా ఉగాది వేడుకలు
TCA | కెనడాలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో టోరంటోలో జరిగిన ఈ వేకల్లో కెనడా తెలుగు, తెలంగాణ వాసులు పాల్గొన్నారు. ఆన్లైన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమాన్ని
టొరంటో: కెనడాలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో టోరంటోలో జరిగిన ఈ వేకల్లో కెనడా తెలుగు, తెలంగాణ వాసులు పాల్గొన్నారు. ఆన్లైన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమాన్ని టీసీఏ ఉపాధ్యక్షుడు మన్నెం శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం టీసీఏ అధ్యక్షుడు ఈద రాజేశ్వర్ మాట్లాడుతూ.. ఉగాది పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ తెలుగు సంప్రదాయాలను, కట్టు, బొట్టును భావితరాలకు అందజేయడం సంతోషించదగిన విషయం అన్నారు.

ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్కు చెందిన ప్రముఖ పండితుడు ధనాలకోట సురేష్ చంద్ర వర్మ పంచాంగ శ్రవణం చేశారు. పండుగ విశిష్టత తెలుసుకునేలా చిన్నారులతో ఉగాది పచ్చడి చేసే విధానాన్ని వివరించారు. ‘గజి బిజీ బడి’ అనే నాటకం, ట్రెండింగ్ రీల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకర్షించాయి.

ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ దామోదర్ రెడ్డి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అధ్యక్షుడు సంతోష్ గజవాడ, కల్చరల్ సెక్రటరీ కవిత తిరుమలాపురం, నవీన్ ఆకుల, శ్రీనివాస్ తిరునగరి, కోటేశ్వర రావు చిత్తలూరి, దేవేందర్ రెడ్డి గుజ్జుల, విజయ్ కుమార్ తిరుమలాపురం, హరి రాహుల్, పభ్రాకర్ కంబాలపల్లి, ప్రకాశ్ చిట్యాల, వెంకట జితేందర్ చక్క, రిషిమా గజవాడ, ఈద శివాని, ఈద వైష్ణవి, తాటి సాయిరామ్, రాహుల్ బాలినేని, మానస ఇనగంటి, ఇతర కార్యవర్గ సభ్యులు, బోర్డు అఫ్ ట్రస్టీ సభ్యులు పాల్గొన్నారు.


Read Today's Latest Nri News in Telugu and Telugu News
- Tags
- Canada
- Panchangam
- TCA
- Toronto
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

