TCSS Meet | తెలంగాణ వాసులు ఒక్కతాటిపై కష్టసుఖాలు పంచుకోవాలి.. టీసీఎస్ఎస్ పిలుపు
TCSS Meet | సింగపూర్‌లోని తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) సభ్యుల మీట్ అండ్ గ్రీన్ ఆదివారం సంబురంగా సాగింది.
TCSS Meet | సింగపూర్‌లో నివసిస్తున్న తెలంగాణ వాసులందరూ ఒక్క తాటిపై ఉండి కష్ట సుఖాలు పంచుకోవాలని తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్ – TCSS) కార్యవర్గ సభ్యులు పిలుపునిచ్చారు. సింగపూర్‌లో తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్ – TCSS) సభ్యుల మీట్ అండ్ గ్రీట్-2022 ఆదివారం జరిగింది. లిటిల్ ఇండియాలోని ద్వారక రెస్టారెంట్లో జరిగిన విందు సమావేశానికి సొసైటీ ఆహ్వానం మేరకు 50-60 మంది టీసీఎస్ఎస్ లైఫ్‌టైం సభ్యులు హాజరయ్యారు.
తమ ఆహ్వానాన్ని మన్నించి సమావేశానికి హాజరైన సభ్యులకు సొసైటీ కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆత్మీయ విందు సమావేశానికి హాజరైన సభ్యులు పలు విలువైన సలహాలు ఇచ్చారు. సొసైటీ అభివృద్ధికి ప్రతి సభ్యుడి సలహాలు ఎంతో ఉపయోగకరమైనవని, వాటి అమలుకు కార్యవర్గ సభ్యులతో కలిసి కృషి చేస్తామని చెప్పారు.
బతుకమ్మ సంబురాల నిర్వహణకు రూపొందించిన కరపత్రిక, ప్రోమోను విడుదల చేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే అక్టోబర్ ఒకటో తేదీన సంబవాంగ్ పార్క్‌లో బతుకమ్మ వేడుకలు జరుపడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సొసైటీ కార్యవర్గ సభ్యులు తెలిపారు.
ఈ సారి విడుదల చేసిన ప్రోమో ఎంతో ప్రత్యకమైందని టీసీఎస్ఎస్ సభ్యులు చెప్పారు. ఇందులో పూర్తిగా తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) సభ్యులు ప్రత్యేకంగా పాటలు రాసి ఆలాపించారు. ఈ పాటను రచించి సాహిత్యం అందజేసిన కాసర్ల శ్రీనివాస రావును సభ్యులంతా అభినందించారు. ఈ గీతాన్ని ఆలపించిన శ్రావ్య అత్తిలి ఎంతో శ్రావ్యంగా ఉందని కొనియాడారు.
ఈ సమావేశంలో టీసీఎస్ఎస్ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కార్యదర్శి గడప రమేష్ బాబు, కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, భాస్కర్ గుప్త నల్ల, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్ కుమార్, రోజా రమణి, నంగునూరి వెంకట రమణ, కార్యవర్గ సభ్యులు, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, శశిధర్ రెడ్డి, పెరుకు శివ రామ్ ప్రసాద్, కాసర్ల శ్రీనివాస్, శ్రీధర్ కొల్లూరి, భాస్కర్ నడికట్ల, శివ ప్రసాద్ ఆవుల,రవి కృష్ణ విజాపూర్ పాల్గొన్నారు.
సభ్యులు, సొసైటీ వెన్నంటి ఉంటూ సహకారం అందిస్తున్న సహచర సభ్యులు, దాతలు, ప్రతి ఒక్కరికి కార్యవర్గ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. తమ సొసైటీకి ఇతర సభ్యులు ఎంతో మంది ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించడానికి ముందుకు రావడం సంతోషకరం అని అభిప్రాయ పడ్డారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

