NRI | వాషింగ్టన్ డి.సి.లో ఘనంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ బతుకమ్మ వేడుకలు
NRI | టి.డి.ఎఫ్ వాషింగ్టన్ డి.సి., చాఫ్టర్ వనితా టీమ్ ఆధ్వర్యంలో అక్టోబర్ 15న బ్రాడ్ రన్ హైస్కూల్ ఆశ్ బర్న్, వర్జీనియాలో బతుకమ్మ, దసరా సంబురాలు అంబరాన్నంటాయి. ఈ బతుకమ్మ పండుగకి ప్రత్యేక అతిథిగా TDF USA అధ్యక్షుడు డాక్టర్ దివేష్ అనిరెడ్డి, TDF USA చైర్మన్ వెంకట్ మారం, టి.డి.ఎఫ్ ఫౌండర్ ప్రెసిడెంట్ మురళీ చింతలపాణి ప్రత్యేక అథిలుగా హాజరయ్యారు.
అమెరికా : టి.డి.ఎఫ్ వాషింగ్టన్ డి.సి., చాఫ్టర్ వనితా టీమ్ ఆధ్వర్యంలో అక్టోబర్ 15న బ్రాడ్ రన్ హైస్కూల్ ఆశ్ బర్న్, వర్జీనియాలో బతుకమ్మ, దసరా సంబురాలు అంబరాన్నంటాయి. ఈ బతుకమ్మ పండుగకి ప్రత్యేక అతిథిగా TDF USA అధ్యక్షుడు డాక్టర్ దివేష్ అనిరెడ్డి, TDF USA చైర్మన్ వెంకట్ మారం, టి.డి.ఎఫ్ ఫౌండర్ ప్రెసిడెంట్ మురళీ చింతలపాణి ప్రత్యేక అథిలుగా హాజరయ్యారు.
టి.డి.ఎఫ్, తెలంగాణ రాష్ట్రంలోని పలు గ్రామాల్లో చేస్తున్న అభివృద్ధి పనులను వివరించారు. ఇండియా నుంచి ప్రఖ్యాత శిల్పి, కళాకారులు ఎంవీ రమణా రెడ్డి తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్న రూపకర్త TDF DC బతుకమ్మ సంబురాల్లో ‘పాత్ టు ఆర్టిస్టిక్ బ్రిలియన్స్, ఏ జర్నీ అన్వీల్డ్’ అనే తన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ బతుకమ్మ పండుగకి ప్రత్యేక ఆకర్షణగా ‘ఎల్లిపోతావురా మనిషి మనిషి’ , ‘బాగుండాలి మనిషి’అనే పాటలతో ‘Swathi Reddy UK’ ఛానల్ లో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని కదిలింది. స్వాతి రెడ్డి బతుకమ్మ పాటలు పాడుతూ, స్త్రీలతో కలసి ఆడుతూ అందరిలో జోష్ నింపారు.

వేడుకల్లో పాల్గొన్న ఎన్నారైలు
నవ్య ఆలపాటి తన బృందంతో తెలంగాణ పల్లె పదాల మెడ్లీ నృత్యాన్ని, మంజువాణి తన బృందంతో మహిషాసుర మర్ధిని నృత్య రూపకాన్ని ప్రదర్శించి ఆహుతులని అబ్బుర పరిచారు. విశ్వ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటున్న తెలుగు వారందరికీ, వాషింగ్టన్ డి.సి బతుకమ్మ పండుగకు హాజరైన అందరికి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ వాషింగ్టన్ డిసి వనితా టీమ్ నాయకులు కవితా చల్లా, వినయ సూరనేని కృతజ్ఞతలు తెలిపారు.
ఇంకా ఈ పండుగ విజయవంతం కావడంలో ముఖ్య పాత్ర వహించిన కల్పన బోయినపల్లి, శ్రీకళ, శివాని, మంజు గంగ, మంజువాణి, సూరనేని రామ్మోహన్ , జీనత్, నవీన్ చల్ల, పున్నం జొన్నల, అనిల్ కేసినేని, అమరేందర్ బొజ్జ, అశ్విని, పవన్, కరుణాకర్, రాధిక, శ్వేత ఇమ్మడి, మల్లారెడ్డి, నరేందర్, షర్మిల, వలంటీర్లకి కవిత చల్ల, వినయ సూరనేని కృతజ్ఞతలు తెలిపారు.

Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

