అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం..ఏపీకి చెందిన భార్యాభర్తలు మృతి
అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. మంచు తుఫాన్ ప్రభావంతో మరణాల సంఖ్య రోజురోజుకూ పెరిగి పోతుంది.
అమరావతి :అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. మంచు తుఫాన్ ప్రభావంతో మరణాల సంఖ్య రోజురోజుకూ పెరిగి పోతుంది. న్యూజెర్సీలోని అరిజోనాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు దంపతులు మంచుతుఫాన్‌లో ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా పాలపర్రుకు చెందిన ముద్దన నారాయణ , భార్య హరిత , ఇద్దరు పిల్లలతో కలిసి న్యూజెర్సీ నగరంలో నివాసముంటున్నారు.
విహార యాత్రకు బయలు దేరిన సమయంలో మంచు తుఫాన్ వీరిని కమ్మేసింది. వెంటనే సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. హరిత మృతదేహం లభ్యం కాగా నారాయణ ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. వీరిద్దరి పిల్లలు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
న్యూజెర్సీలో జరిగిన ఘటన వివరాలను ఏపీలోని మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యుల ఇంట విషాదం నెలకొని ఉంది.మృతదేహాలను స్వస్థలానికి చేర్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

