Dushera Cultural Night | 28న సింగపూర్ తెలుగు సమాజం `దసరా కల్చరల్ నైట్`!
Dushera Cultural Night | సింగపూర్ తెలుగు సమాజం (ఎస్టీఎస్) ఆధ్వర్యంలో దసరా సందర్భంగా అత్యంత వేడుకగా దసరా కల్చరల్ నైట్ -2023 కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 28 (శనివారం) సాయంత్రం మూడు గంటల నుంచి నాన్యంగ్ ఆడిటోరియంలో దసరా కల్చరల్ నైట్ -2023 జరగనున్నది.
Dushera Cultural Night | సింగపూర్ తెలుగు సమాజం (ఎస్టీఎస్) ఆధ్వర్యంలో దసరా సందర్భంగా అత్యంత వేడుకగా దసరా కల్చరల్ నైట్ -2023 కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 28 (శనివారం) సాయంత్రం మూడు గంటల నుంచి నాన్యంగ్ ఆడిటోరియంలో దసరా కల్చరల్ నైట్ -2023 జరగనున్నది. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత తెలుగు యాంకర్ సుమ కనకాల తొలిసారి సింగపూర్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దసరా కల్చరల్ నైట్ ఆద్యంతం చాలా ఉత్సాహబరితంగా ఉండబోతుందని కార్యక్రమ నిర్వాహకులు కురిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి తెలిపారు.
ప్రఖ్యాత జబర్దస్త్ కళాకారులు బుల్లెట్ భాస్కర్, నాటీ నరేష్, బిగ్ బాస్ ఫేమ్ ఫైమాల హాస్య ప్రదర్శనలు, ప్రముఖ ఇల్యూజనిస్ట్, ఇండియా గాట్ టాలెంట్ గ్రాండ్ ఫైనలిస్ట్ బీయస్ రెడ్డి కార్యక్రమం మరింత సందడిగా ఉంటుందని ఎస్టీఎస్ అధ్యక్షులు బొమ్మారెడ్డి మీడియాకు తెలిపారు.
తెలుగు వారి పెద్ద పండుగల్లో ఒకటి ఈ విజయదశమి. ఈ విజయదశమి పండుగును పిల్లలు,పెద్దలతో కేరింతల నడుమ జరుపుకోవటానికి తొలి సారి ఢీ జోడీ విజేత సంకేత్, నైనిక లతో డాన్స్ కూడా ఏర్పాటు చేశామని సమాజం కార్యదర్శి పోలిశెట్టి అనిల్ తెలిపారు. సంపంగి డెవలపర్స్, జి ఐ జి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఈవెంట్ పార్టనర్‌గా జె మీడియా ఫ్యాక్టరీ, జానిక్, ప్రాప్నెక్స్ కుమార్, రమేష్ తదితరులు స్పాన్సర్లుగా ఉన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరయ్యే టికెట్స్ బుక్ మై షో ద్వారా శర వేగంగా బుక్ అవుతున్నాయని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం అందరికీ అందుబాటులో ఉండాలని ఆరు క్యాటగిరీలలో (వీఐపీ, ప్లాటినం, డైమండ్, గోల్డ్, సిల్వర్, బాల్కానీ) టికెట్లు విక్రయిస్తున్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

