Nri | కెనడాలో వైభవంగా సంక్రాంతి సంబురాలు
Nri | తాకా (తెలుగు అలయన్సస్ ఆఫ్ కెనడా) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరిగాయి. బటొరంటో నగరంలోని శ్రుంగేరి కమ్యూనిటీ సెంటర్ (SVBF ఫౌండేషన్)లో నిర్వహించి సామజిక మాధ్యమాల (Youtube, Twitter, Instagram, Facebook) ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసారు.

కెనడా : తాకా (తెలుగు అలయన్సస్ ఆఫ్ కెనడా) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరిగాయి. బటొరంటో నగరంలోని శ్రుంగేరి కమ్యూనిటీ సెంటర్ (SVBF ఫౌండేషన్)లో నిర్వహించి సామజిక మాధ్యమాల (Youtube, Twitter, Instagram, Facebook) ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసారు.
ఈ కార్యక్రమాన్ని వందలాది మంది అంతర్జాలంలో వీక్షించి విజయవంతం చేసారు. ఈ కార్యక్రమానికి అనిత సజ్జ, మహమ్మద్ ఖాజిల్, విద్య భావనం, మరియు రేణు కుందెమ్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మొదటగా తాకా అధ్యక్షురాలు కల్పనా మోటూరి, అనిత సజ్జ, సీత శ్రావణి పొన్నలపల్లి కార్యక్రమాన్నిజ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.
తాకా కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి కార్యక్రమానికి విచ్చేసిన అతిధులను అందరినీ ఆహ్వానించి సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను వివరించారు. 20 కి పైగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, కళా నృత్యాలు, సినిమా పాటలు, డ్యాన్సులు తో దాదాపు 4 గంటల పాటు ఉల్లాసంగా ఉత్సవాలను నిర్వహించారు.

అలాగే టొరంటో తెలుగు తిథులు, నక్షత్రాలకు అనుగుణంగా ప్రచురించిన తెలుగు క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భం గా తెలుగు క్యాలెండర్ ముద్రణ కు సహకరించిన, టొరంటో కు తీసుకువచ్చిన రాకేష్ గరికిపాటికి, ప్రసన్న తిరుచిరాపల్లికి కల్పనా మోటూరి కృతజ్ఞతలు తెలియజేసారు.
ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల, కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి, కోశాధికారి మల్లికార్జున చారి పదిర, సాంస్కృతిక కార్యదర్శి రాజారామ్ మోహన్ రాయ్ పుల్లంశెట్టి, డైరెక్టర్స్ అనిత సజ్జ, గణేష్ తెరల,రాణి మద్దెల మరియు ట్రస్టీ చైర్మన్ మునాఫ్ అబ్దుల్, సభ్యులు రాఘవ్ అల్లం, సురేష్ కూన, వాణి జయంతి, ప్రవీణ్ పెనుబాక, ఇతర వ్యవస్థాపక చైర్మన్ రవి వారణాసి, సభ్యులు చారి సామంతపూడి, లోకేష్ చిల్లకూరు,రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి, శ్రీనాథ్ కుందూరిని కల్పన అభినందించారు.


Read Today's Latest Nri News in Telugu and Telugu News
- Tags
- Canada
- Nri
- Sankranti samburalu
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

