NRI | ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ సంబురాల సంక్రాంతి 2022
సింగపూర్ తెలుగు సమాజం అనాదిగా నిర్వహించే సంక్రాంతి సందడి ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు. మన భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడమే ధ్యేయంగా పనిచేస్తున్న సింగపూర్ తెలుగు సమాజం, ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా సంప్రదాయబద్దంగా మన ఊరి పండుగ వాతావరణం ప్రతిబింబించేలా నిర్వహించారు.

సింగపూర్ లో నివసిస్తున్న బాలబాలికలు, యువతీ యువకులతో వైవిధ్యభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిచడమే కాకుండా, మహిళలతో రంగవల్లులు, చిన్నారులకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించి, కార్యక్రమ వీక్షకుల అభిప్రాయ సేకరణతో విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈసంబురాలలో సింగపూర్ కాలమానంతో తయారు చేసిన సింగపూర్ తెలుగు 2022 క్యాలెండెర్ను ఆవిష్కరించారు. ఇంగ్లీష్ ఉపయోగించకుండా తెలుగులో మాత్రమే మాట్లాడే కార్యక్రమం తెలుగు పలుకులు ప్రత్యేక ఆకర్షణగా అన్ని వయస్సుల వారిని ఆసాంతం ఆకట్టుకున్నాయి. మనకు తెలియకుండా మనం భాషను ఏవిధంగా కోల్పోతున్నామో వీక్షకులను ఆలోచించేలా చేసింది. తెలుగు సంస్కృతికి పట్టుగొమ్మలు, అచ్చతెలుగు సంక్రాంతికి ఆలవాలమైన తెలుగు రాష్ట్రాల పల్లెల్లో పండుగను వీడియో ద్వారా చూపించి అందరి మన్ననలను పొందారు. ఆటపాటల విజేతలకు తెలుగు సమాజం తరుపున బహుమతులు అందజేశారు.

సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి, తెలుగు వారందరికీ సంక్రాతి శుభాకాంక్షలతో పాటు స్వాగత వచనాలు పలికారు. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన లక్ష్మీనారాయణ, అనిత రెడ్డి, మైత్రి, సౌందర్య, రాఘవకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన స్వాతికి కృతజ్ఞతలు తెలియజేశారు.

కోవిడ్ కారణంగా భోగి పండుగకు రేగుపండ్ల ప్యాకెట్స్ ని ఉచితంగా పంపిణీ చేయలేకపోయామని సింగపూర్ తెలుగు సమాజం కమిటీ సభ్యులు, కార్యక్రమ నిర్వహకులు స్వాతి కురిచేటి తెలిపారు. అలానే ప్రతి సంవత్సర మాదిరిగా అందరిని ప్రత్యక్షంగా కలవలేకపోయామని, అయినా కూడా ఇంటర్నెట్లో నిర్వహించిన కార్యక్రమాన్ని సుమారు 5000 మంది వరకు వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలియచేశారు.

పోటీల విజేతలు వీరే..
సంక్రాంతి పండుగ సందర్భంగా పలు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారి వివరాలను తెలియజేశారు. పోటీలు, ప్రదర్శనలలో పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లను పోస్ట్ ద్వారా పంపిస్తామని పేర్కొన్నారు.
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ విజేతలు : కృతిక (ప్రథమ బహుమతి) , డి.తస్విఖ (రెండవ బహుమతి) , సంహిత (తృతీయ బహుమతి), గర్వ్ కుండ్లియా (కన్సొలేషన్ బహుమతి), వరాహగిరి వేదాంషి (కన్సొలేషన్ బహుమతి).
రంగోలి పోటీ విజేతలు : పావని చిలువేరు (ప్రథమ బహుమతి), నీలా దేవి (రెండవ బహుమతి), పోలినేని లీలా భార్గవి (తృతీయ బహుమతి)
తెలుగు పలుకులు పోటీ విజేతలు : కొమ్మిరెడ్డి నిషాంత్ రెడ్డి (ప్రథమ బహుమతి) , లక్ష్మి శ్రీనిజ చింతలపూడి (ద్వితీయ బహుమతి), రావూరి జ్ఞాన కౌశికి (తృతీయ బహుమతి), నామ సాయి ఈశ్వర (కన్సొలేషన్ బహుమతి).
ఆహ్లాదభరితంగా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ, స్వచ్ఛంద సేవకులకు, కార్యవర్గానికి, కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్లకు సింగపూర్ తెలుగు సమాజం కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలను తెలియజేశారు.


Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

