MLC Kavitha | లండన్‌లో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు
MLC Kavitha | తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) మహిళా విభాగం ఆధ్వర్యంలో ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
MLC Kavitha | తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) మహిళా విభాగం ఆధ్వర్యంలో ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన ఆదర్శమైన నాయకురాలు కవిత అని ప్రశంసించారు. ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారని, మహిళల హక్కులపై పోరాటం చేస్తున్న ధీరవనిత, అలాంటి నాయకురాలిపై ప్రస్తుత కేంద్రం ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఎన్నారైలంతా వ్యతిరేకిస్తున్నారన్నారు.
ఎన్నో సంవత్సరాల తమ వెంట ఉంటూ ప్రోత్సహిస్తున్న కవిత వెంటనే తామంతా ఉంటామన్నారు. ఈ సందర్భంగా మహిళలంతా ‘వీ స్టాండ్ విత్ కవిత అక్క’ (#WeStandWithKavithaAkka ) అంటూ నినదించారు. కార్యదర్శి సుప్రజ మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని నిలబడే ధీర వనిత కవిత అని కొనియాడారు. ఇటీవల ఢిల్లీ వేదిక ద్వారా మహిళా బిల్లు కోసం చేపట్టిన దీక్షకు మద్దతు తెలుపుతున్నామన్నారు. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలకు చట్టసభల్లోనూ సమాన అవకాశాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో స్వాతి బుడగం, పావని కడుదుల, క్రాంతి, స్నేహ, శ్వేతా, మౌనిక, నందిని, మమతా, హారిక రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

