JTS | టోక్యోలో జపాన్ తెలుగు సమాఖ్య బతుకమ్మ సంబురాలు
JTS | జపాన్ తెలుగు సమాఖ్య (JTS) ఆ దేశ రాజధాని టోక్యోలోని కొమత్సుగవా పార్కులో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబురాలు జరుపుకుంది. జపాన్‌లోని తెలుగు ప్రజలంతా సంప్రదాయ వస్త్రాలు ధరించి ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. మహిళలు పట్టుచీరలు ధరించి, బతుకమ్మ ఆటలు ఆడుతూ పాటలు పాడుకున్నారు.
టోక్యో: జపాన్ తెలుగు సమాఖ్య (JTS) ఆ దేశ రాజధాని టోక్యోలోని కొమత్సుగవా పార్కులో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబురాలు జరుపుకుంది. జపాన్‌లోని తెలుగు ప్రజలంతా సంప్రదాయ వస్త్రాలు ధరించి ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. మహిళలు పట్టుచీరలు ధరించి, బతుకమ్మ ఆటలు ఆడుతూ పాటలు పాడుకున్నారు. రంగురంగుల పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలు ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఉత్సవాల్లో 200 మంది పాల్గొన్నారు.
జపాన్ తెలుగు సమాఖ్య స్వచ్ఛంద సేవా సిద్ధాంతాలతో వర్ధిల్లుతున్నది. బతుకమ్మ లాంటి ఉత్సవాల నిర్వహణను కొనసాగించడంలో నిర్వాహకుల నడుమ సహకార స్ఫూర్తిని పెంపొందిస్తున్నది. జపాన్ తెలుగు సమాజం ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ఈ విలక్షణమైన వేడుక.. దాని గత, ప్రస్తుత నిర్వాహకులకు గౌరవకరమైనదే కాదు, వారి అచంచలమైన అభిమానానికి ప్రతీక. నిర్మాణాత్మక ఫ్రేమ్‌వర్క్ లేకుండానే తాము ఈ విజయవంతమైన ఈవెంట్లను నిర్వహించగలుగుతున్నామని జపాన్ తెలుగు సమాఖ్య వాలంటీర్ మురళీధర్ అన్నారు.
వనభోజనాలు
బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగానే జపాన్ తెలుగు సమాఖ్య వన భోజనాల కార్యక్రమం నిర్వహించింది. చిన్నాపెద్ద అన్న తేడా లేకుండా రోజంతా ఆటపాటలతో ఎంజాయ్ చేశారు. టోక్యో నగరంలోని కొమత్సుగావా పార్కులో జరిగిన ఈ కార్యక్రమంలో రుచికరమైన భోజనాలు ఆస్వాదించారు. దాదాపు 150 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Japan Vanabojanalu
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

