అంతర్జాతీయ వేదికపై డా. తెన్నేటి సుధాదేవికి ఘన నివాళి
ప్రఖ్యాత కథా–నవలా రచయిత్రి, తెలుగు అకాడమీ పూర్వ ఉపసంచాలకులు, వంశీ సంస్థల అధ్యక్షురాలు డా. తెన్నేటి సుధాదేవి స్మరణార్థం అంతర్జాల వేదికపై శనివారం ఘన నివాళి సభ నిర్వహించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్, శ్రీ సాంస్కృతిక కళాసారథి–సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ప్రఖ్యాత కథా–నవలా రచయిత్రి, తెలుగు అకాడమీ పూర్వ ఉపసంచాలకులు, వంశీ సంస్థల అధ్యక్షురాలు డా. తెన్నేటి సుధాదేవి స్మరణార్థం అంతర్జాల వేదికపై శనివారం ఘన నివాళి సభ నిర్వహించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్, శ్రీ సాంస్కృతిక కళాసారథి–సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
నవంబర్ 23న హైదరాబాద్‌లో పరమపదించిన డా. సుధాదేవి.. వంశీ సంస్థల వ్యవస్థాపకులు డా. వంశీ రామరాజు ధర్మపత్ని. ఆమె స్మరణలో వివిధ దేశాల్లోని తెలుగు ప్రవాస సంస్థల ప్రతినిధులు, దేశంలోని పలువురు ప్రముఖులు పాల్గొని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు డా. వంగూరి చిట్టెన్రాజు, శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, సమన్వయకర్త రాధిక మంగిపూడి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సుమారు నాలుగు గంటల పాటు సాగిన ఈ సభలో డా. వంశీ రామరాజు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా తమ కుటుంబానికి సానుభూతి తెలిపిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్‌తో పాటు పది దేశాల నుంచి సుమారు 50 మంది ప్రముఖులు పాల్గొన్నారు.

Tenneti Sudhadevi3
భారత్ నుంచి వంశీ సంస్థలతో అవినాభావ సంబంధం ఉన్న పద్మభూషణ్ డా.యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, డా. మేడసాని మోహన్, సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, సినీ రచయిత భువనచంద్ర, సంగీత విద్వాంసులు గరికపాటి ప్రభాకర్, గాయకులు గజల్ శ్రీనివాస్, గాయని సురేఖ మూర్తి, హాస్యబ్రహ్మ శంకరనారాయణ, సినీ నటులు సుబ్బరాయశర్మ, సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, రచయిత్రి జలంధర చంద్రమోహన్, రాజకీయవేత్త వామరాజు సత్యమూర్తి, అవధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, జుర్రు చెన్నయ్య, పొత్తూరి సుబ్బారావు తదితర వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

Tenneti Sudhadevi2
ఈ కార్యక్రమంలో అమెరికా, సింగపూర్, ఖతర్, కువైట్, సౌదీ అరేబియా, ఉగాండా, మలేషియా, హాంకాంగ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల నుంచి కృష్ణవేణి శ్రీ పేరి, సుచిత్ర, బూరుగుపల్లి వ్యాసకృష్ణ, సత్య మల్లుల, పద్మ మల్లెల, జయ పీసపాటి, స్వాతి జంగా, విక్రమ్ సుఖవాసి, వెంకప్ప భాగవతుల, సీతాపతి అరికరేవుల , తాతాజీ & పద్మజ ఉసిరికల, శ్రీసుధ, మాధవీలలిత, సాహిత్య జ్యోత్స్న, కోనేరు ఉమామహేశ్వర రావు, శారదా పూర్ణ శొంఠి, శారద ఆకునూరి, రాధిక నోరి రాధ కాసినాథుని, కె ధర్మారావు, గుణ కొమ్మారెడ్డి, డా. సత్యమూర్తిడా. సుజాత కోటంరాజు, డా. బి కె మోహన్ పాల్గొన్నారు. వంశీ సంస్థలతో సుధ గారితో తమకున్న అనుబంధాన్ని గురించి నెమరు వేసుకుంటూ ఆమెను స్మరించుకున్నారు.

Tenneti Sudhadevi1
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

