e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News HCL H-1B Violation | హెచ్‌-1బీకి హెచ్‌సీఎల్ దోఖా.. అమెరిక‌న్ల కంటే త‌క్కువ వేత‌నాలు!

HCL H-1B Violation | హెచ్‌-1బీకి హెచ్‌సీఎల్ దోఖా.. అమెరిక‌న్ల కంటే త‌క్కువ వేత‌నాలు!

HCL H-1B Violation | హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్‌.. అమెరికాలో హెచ్‌-1 బీ వీసా కింద ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌కు అమెరిక‌న్ల కంటే త‌క్కువ వేత‌నాలు చెల్లిస్తున్న‌ద‌ని ప్ర‌జా వేగు సంస్థ ఆరోపించింది. గ‌త కొన్నేండ్లుగా హెచ్‌-1బీ వీసా కింద ప‌ని చేస్తున్న నిపుణుల‌కు 95 మిలియ‌న్ల డాల‌ర్లు మాత్ర‌మే చెల్లిస్తున్న‌ద‌ని పేర్కొంటూ ఎక‌న‌మిక్ పాల‌సీ ఇన్‌స్టిట్యూట్ (ఈపీఐ) ఒక నివేదిక‌ను రూపొందించింది. అమెరిక‌న్ ఉద్యోగుల కంటే హెచ్‌-1బీ వీసా నిపుణుల‌కు హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్ త‌క్కువ వేత‌నాలు చెల్లిస్తున్న‌ద‌ని స‌మాచారం. ప్ర‌తియేటా అమెరికాలో హెచ్‌-1బీ వీసా పొందుతున్న మూడు అతిపెద్ద ఐటీ సంస్థ‌ల్లో ఇది ఒక‌టి. గ‌తేడాది పొందిన హెచ్‌-1బీ వీసాల్లో హెచ్‌సీఎల్ ఎనిమిదో స్థానంలో ఉంది. 1405 కొత్త వీసాలు జారీ కాగా, 2801 మంది వీసాలు రెన్యూవ‌ల్ అయ్యాయి. 2009 నుంచి హెచ్‌సీఎల్ ఇప్ప‌టివ‌ర‌కు 31 వేల హెచ్‌-1 బీ వీసాల‌ను పొందింది.

అతిపెద్ద కార్పొరేష‌న్ల‌లో హెచ్‌1బీ నిపుణులు ఇలా

డిస్నీ, ఫెడ్ఈఎక్స్‌, గూగుల్ త‌దిత‌ర పేరొందిన కార్పొరేష‌న్ల‌లో హెచ్‌-1బీ వీసా పొందిన వ‌ల‌స కార్మికులు స‌బ్ కాంట్రాక్ట‌ర్లుగా ప‌ని చేస్తున్నార‌ని, వారికి అతి త‌క్కువ‌గా 95 మిలియ‌న్ల డాల‌ర్లే చెల్లిస్తున్నార‌ని ఈపీఐ ప్ర‌తినిధులు రొన్ హిరా, డానియ‌ల్ కొస్టా త‌మ నివేదిక‌లో పేర్కొన్నారు. బాధితుల్లో హెచ్‌-1బీ వ‌ర్క‌ర్లు మాత్ర‌మే కాదు.. అమెరిక‌న్ వ‌ర్క‌ర్లు కూడా ఉన్నారు. అమెరిక‌న్ వ‌ర్క‌ర్ల‌కు స్థాన‌భ్రంశం క‌ల్పించ‌డం గానీ, వారిని త‌క్కువ వేత‌నాల‌కు ప‌ని చేస్తున్న వ‌ల‌స కార్మికుల‌తో క‌లిపేయ‌డం గానీ చేస్తున్నార‌ని తెలిపారు.

ఒరాకిల్‌లో 55వేల డాల‌ర్లే

- Advertisement -

ఉదాహ‌ర‌ణ‌కు ఒరాకిల్‌లో ప‌ని చేస్తున్న హెచ్‌-1బీ వీసా నిపుణులు 55 వేల డాల‌ర్లు మాత్ర‌మే పొందుతున్నారు. ఇది అమెరిక‌న్ వ‌ర్క‌ర్ల కంటే త‌క్కువ‌. ఇది పూర్తిగా హెచ్‌-1బీ ప్రోగ్రాం నిబంధ‌న‌ల‌ను పూర్తిగా ఉల్లంఘించ‌డ‌మేన‌న్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ ఈ ఆరోప‌ణ‌ల‌ను హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్ అధికార ప్ర‌తినిధి నిరాక‌రించారు. చ‌ట్టాల‌కు లోబ‌డి ఉద్యోగులంద‌రికీ వేత‌నాలు చెల్లిస్తున్నామ‌ని తెలిపారు.

హెచ్‌-1బీ నిపుణుల‌కు ఔట్‌సోర్సింగ్ జాబ్స్‌!

హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్ వంటి ఐటీ దిగ్గ‌జాలు.. హెచ్‌-1బీ వీసా నిపుణుల‌కు నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా వేత‌నాలివ్వ‌డంలో చ‌ట్టాల్లో లొసుగుల‌ను వాడుకుంటున్నాయ‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. హెచ్-1బీ వీసా కింద అమెరికాకు వెళ్లిన భార‌తీయ నిపుణుల‌కు నేరుగా నియామ‌క ఉత్త‌ర్వులు ఇవ్వ‌కుండా ఔట్ సోర్సింగ్ సంస్థ‌ల ద్వారా నియామ‌కాలు చేప‌డుతున్నాయ‌ని స‌మాచారం. క‌నుక డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబ‌ర్ (డీవోఎల్‌) అధికారులు ఈ లొసుగుల‌ను తొల‌గించి, అమెరిక‌న్లు, హెచ్‌-1బీ వీసా నిపుణుల హ‌క్కుల‌ను కాపాడాల‌ని ఈపీఐ సూచించింది.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement