International Migrants Day | వలసదారుల శ్రేయస్సు కోసం సింగపూర్‌లో అంతర్జాతీయ వలసదారుల దినోత్సవ వేడుకలు..!
International Migrants Day | అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం సందర్భంగా వారి సంక్షేమం, శ్రేయస్సు కోసం సింగపూర్ మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ సంయుక్తంగా పాల్గొన్నాయి.
International Migrants Day | ప్రతి సంవత్సరం డిసెంబర్ 17న, ప్రపంచం అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంగా గుర్తింపబడుతుంది, ఇది వలసదారుల మధ్య ఉండే అమూల్య సహకార సంబంధానికి ప్రతీకగా, వారి హక్కులు, శ్రేయస్సు కోసం నిలబడే రోజుగా వేడుక చేసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా వలసదారులు ఎదుర్కొంటున్న సమస్యలు- సవాళ్లను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం థీమ్ `సురక్షిత వలసలను ప్రోత్సహించడం`.

ఈ నేపథ్యంలో శ్రీ సాంస్కృతిక కళాసారథి – సింగపూర్, సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ సంయుక్తంగా కార్మికుల వలసదారుల కోసం 2023 డిసెంబర్ 17న జలాన్ పాపన్లోని టెరుసన్ రిక్రియేషన్ సెంటర్లో సింగపూర్ ప్రభుత్వ మానవ వనరులశాఖ నిర్వహించిన అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం-2023లో పాల్గొన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో వందలాది కార్మిక సోదరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక సోదరుల కోసం ప్రత్యేకంగా డ్రాయింగ్ పోటీ నిర్వహించి 25 మంది విజేతలకు బహుమతులు అందచేశారు. తెలంగాణ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన తెలంగాణ వంటలు (సకినాలను) అందరికీ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్, ప్రధాన కార్యనిర్వాహక సభ్యులు సుధాకర్ జొన్నాదుల, శ్రీధర్ భరద్వాజ్, రామాంజనేయులు చామిరాజు, తెలంగాణ కల్చరల్ సొసైటీ అధ్యక్షులు గడప రమేష్, ప్రధాన కార్యనిర్వాహక సభ్యులు మామిడాల ప్రవీణ్, పేరుకు శివరామ్ ప్రసాద్, విజయ మోహన్ వెంగళ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా భాగస్వామ్యులైన శ్రీ సాంస్కృతిక కళాసారథి, తెలంగాణ కల్చరల్ సొసైటీ సంస్థలు, ఆ సంస్థల ప్రతినిధులను సింగపూర్ ప్రభుత్వ మానవ వనరులశాఖ ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు.

Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

