BRS NRI | మహిళా రిజర్వేషన్ బిల్లు.. ఎన్ఆర్ఐల మద్దతు కోసం ఆస్ట్రేలియాలో ప్రచారం..
BRS NRI | బీఆర్ఎస్ ఆస్ట్రేలియా( BRS Australia ) మహిళా వింగ్ అధ్యక్షురాలు సంగీత ధూపాటి( Sangeetha Dhupati ) ఆధ్వర్యంలో సిడ్నీలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద గ్లోబల్ ఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల( Mahesh Bigala ) మహిళా రిజర్వేషన్ బిల్లు( Women Reservation Bill )కు ఎన్ఆర్ఐల మద్దతుకై ప్రచారాన్ని ప్రారభించారు.
BRS NRI | బీఆర్ఎస్ ఆస్ట్రేలియా( BRS Australia ) మహిళా వింగ్ అధ్యక్షురాలు సంగీత ధూపాటి( Sangeetha Dhupati ) ఆధ్వర్యంలో సిడ్నీలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద గ్లోబల్ ఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల( Mahesh Bigala ) మహిళా రిజర్వేషన్ బిల్లు( Women Reservation Bill )కు ఎన్ఆర్ఐల మద్దతుకై ప్రచారాన్ని ప్రారభించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( MLC Kavitha ) మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి మద్దతుగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ఆర్ఐల మద్దతు కోసం మొదటిసారిగా ఆస్ట్రేలియాలో ప్రచారం ప్రారంభించామని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు తమ మద్దతు తెలపాలని మహేష్ బిగాల కోరారు.
తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల విశిష్టతను ఖండాంతరాలకు వ్యాప్తి చెందేలా కృషిచేశారు. నాడు హైదరాబాద్ లాంటి పట్టణాల్లో, విదేశాల్లో ఆత్మన్యూనతకు గురైన బతుకమ్మ నేడు ఆయా దేశాలు బతుకమ్మ పండగను అధికారికంగా నిర్వహించేస్థాయికి తీసుకొచ్చారని తెలిపారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దేశవ్యాప్తంగా మహిళలను ఐక్యం చేసి బిల్లును సాధిస్తారని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు.
సిడ్నీలో జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గిరి రాపోలు, కన్వీనర్ రవిశంకర్ ధూపాటి, లివింగ్స్టున్ చెట్టిపల్లి, అమ్రీన్, గుల్షన్ ఆర, స్వప్న నెల్లీ, పరశురామ్, అజాజ్, ఇస్మాయిల్, చిరాన్ పురంశెట్టి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

