Republic Day | కువైట్లోని భారత రాయబార కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
Republic Day | కువైట్లోని భారత రాయబార కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. చల్లటి వాతావరణం, చినుకులతో కూడిన వర్షం ఉన్నప్పటికీ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు పిల్లలు, పెద్దలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు భారత రాయబారి హెచ్ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైక జాతీయ జెండాను ఆవిష్కరించారు. జా
Republic Day | కువైట్లోని భారత రాయబార కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. చల్లటి వాతావరణం, చినుకులతో కూడిన వర్షం ఉన్నప్పటికీ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు పిల్లలు, పెద్దలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు భారత రాయబారి హెచ్ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైక జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయగీతం ఆలపించిన అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని చదివి వినిపించారు.అంతకుముందు రాయబారి కార్యాలయ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా మాట్లాడుతూ.. భారత్, కువైట్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాన్ని గుర్తు చేశారు. కువైట్లో నివసిస్తున్న భారతీయులకు రాయబార కార్యాలయం ఎల్లప్పుడూ సహాయం అందజేస్తుందని హామీ ఇచ్చారు. భారతీయులకు అన్ని సహాయ సహకారాలు అందించడానికి రాయబార కార్యాలయం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. సహాయం అందించేందుకు వాట్సాప్ నంబర్లు 24 గంటలు అందుబాటులో ఉంటాయని.. వారపు బహిరంగ సభల్లో తానే వ్యక్తిగతంగా అందుబాటులో ఉంటానని చెప్పారు. ప్రవాసుల కోసం కుటుంబ వీసాను తెరవడానికి కువైట్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.
కువైట్లో భారతీయ సంఘాలు నిర్వహిస్తున్న వివిధ సేవలను కూడా రాయబా డాక్టర్ ఆదర్శ్ స్వైకా ప్రశంసించారు. కాగా, రిపబ్లిక్ డే వేడుకలకు హాజరైన ప్రజలకు కువైట్లోని వివిధ భారతీయ రెస్టారెంట్లు ఫలహారాలను అందించాయి.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video



