న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ అయిన బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) వివిధ విభాగాల్లో ఖాలీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 103 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో అప్రెంటిస్, డాటా ఎంట్రీ ఆపరేటర్, సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం ఖాళీలు: 103
ఇందులో హాండీమ్యాన్ లేదా లోడర్ 67, సూపర్వైజర్ 20, సీనియర్ సూపర్వైజర్ 9, డాటా ఎంట్రీ ఆపరేటర్ 20 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: హాండీమ్యాన్ పోస్టులకు ఎనిమిదో తరగతి, మిగిలిన పోస్టులకు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 7
వెబ్సైట్: www.becil.com