SSC Recruitment | స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 5369 ఉద్యోగాలు
5369 పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ప్రకటన విడుదల చేసింది.
Staff selection commission | 5369 పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, అకౌటెంట్, రీసెర్చి ఇన్వెస్టిగేటర్, టెక్నికల్ అసిస్టెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును అనుసరించి ఎస్ఎస్సీ, ఇంటర్, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో ప్రారంభంకాగా.. మార్చి 27వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డేటాఎంట్రీ టెస్ట్, కంప్యూటర్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య : 5369
పోస్టులు: ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-II, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, హిందీ టైపిస్ట్, సౌండ్ టెక్నీషియన్, అకౌంటెంట్, ప్లానింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్స్టైల్ డిజైనర్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్, తదితరాలు.
అర్హతలు: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
ఎంపిక: స్కిల్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డేటాఎంట్రీ టెస్ట్, కంప్యూటర్ పరీక్ష ఆధారంగా
దరఖాస్తు: ఆన్లైన్లో
పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం
వయస్సు : 18నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో మినహాయింపు)
దరఖాస్తు ఫీజు: రూ.100
చివరితేదీ: మార్చి 27
వెబ్సైట్: www.sss.nic.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

