హైదరాబాద్: హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ (C-DAC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 5 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 38 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 38
ఇందులో ప్రాజెక్ట్ మేనేజర్ 1, ప్రాజెక్ట్ ఇంజినీర్ 36, ప్రాజెక్ట్ అసోసియేట్ 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత ట్రేడ్లో బీఈ, బీటెక్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 5
వెబ్సైట్: https://www.cdac.in/