న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (IIRS) వివిధ విభాగాల్లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఎంటెక్, ఎమ్మెస్సీ, బీఎస్సీ, పీడీడిప్లొమా చేసిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఎంపికైనవారు ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 16
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో ఎమ్మెస్సీ, ఎంటెక్, బీఈ, బీటెక్, పీజీ డిప్లొమాలో ఏదోఒకటి చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ తేదీలు: అక్టోబర్ 22 నుంచి 29 వరకు
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 29
వెబ్సైట్: recruitment.iirs.gov.in