BOB | ప్రభుత్వరంగంలో రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 14 వరకు అందుబాటులో ఉంటాయి. మొత్తం 159 బ్రాంచ్ రిసీవబుల్ మేనేజర్ (BRM) పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కలిపి 5 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 159
ఇందులో జనరల్ 68, ఓబీసీ 42, ఎస్సీ 23, ఎస్టీ 11, ఈడబ్ల్యూఎస్ 15 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: ఏదైనా డిగ్రీ పూర్తిచేయాలి. అభ్యర్థులు 23 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండి సంబంధిత రంగంలో కనీసం ఏడాది అనుభం తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు రూ.100
దరఖాస్తులు ప్రారంభం: మార్చి 25
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 15
వెబ్సైట్: www.bankofbaroda.in