న్యూఢిల్లీ: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈనెల 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నవంబర్ 10 లోపు NATS పోర్టల్‌లో ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 73 అప్రెంటిస్‌లను అందిస్తున్నది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపికచేస్తున్నది. ఎంపికైనవారు చెన్నైలోని నందన్బాక్కమ్లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 73
ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 63, డిప్లొమా అప్రెంటిస్ 10 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: ఇంజినీరింగ్, డిప్లొమా చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: అకడమిక్ ప్రతిభనుబట్టి అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వారిని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
NATS పోర్టల్‌లో ఎన్రోల్మెంట్: నవంబర్ 10
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 25
షార్ట్‌లిస్ట్: నవంబర్ 30
వెబ్సైట్: www.boatsrp.com