Job news: నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్లో 675 అప్రెంటిస్లు
నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్| ప్రభుత్వరంగ సంస్థ అయిన నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్సీ) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థ అయిన నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్సీ) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు ఆన్లైన్లో అప్లయ్చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 675 అప్రెంటిస్లను భర్తీ చేస్తున్నది. ఇందులో ఫిట్టర్, ఎలక్ట్రిషన్, మెకానిక్, వెల్డర్, టర్నర్ వంటి ట్రేడ్లు ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్లు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఎంపికైనవారికి ఏడాదిపాటు శిక్షణ అందిస్తారు.
మొత్తం ఖాలీలు: 675
ఇందులో ఫిట్టర్ 90, టర్నర్ 35, మెకానిక్ (మోటార్ వెహికిల్) 95, ఎక్ట్రిషియన్ 90, వైర్మెన్ 90, మెకానిక్ 10 (డీజిల్ 5, ట్రాక్టర్ 5), కార్పెంటర్ 5, ప్లంబర్ 5, స్టెనోగ్రాఫర్ 15, వెల్డర్ 90, పాసా 30, అకౌంటెంట్ 40, డాటా ఎంట్రీ ఆపరేటర్ 40, హెచ్ఆర్ అసిస్టెంట్ 40 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత ట్రేడ్లో ఐటీ, డిగ్రీలో బీకామ్, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ ఉత్తీర్ణులవాలి. అభ్యర్థులు 14 ఏండ్ల పైబడినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: అకడమిక్ వెయిటేజీని బట్టి
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 16
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 25
వెబ్సైట్: https://www.nlcindia.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

