నీటి కఫ్టాలు!
మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయంలో నీటి ఇబ్బందులు తప్పడంలేదు. వేసవికాలం కావడంతో తాగునీటి కోసం కాలనీవాసులు అల్లాడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మండల కేంద్రంలోని భీమ్గల్ రోడ్డులో ఉన్న మాలగుట్ట వద్ద 48 డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించారు. గతేడాది నవంబర్లో లాటరీ పద్ధతిన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లను కేటాయించారు. అయితే గృహప్రవేశాలు చేసుకొని ఇండ్లకు వచ్చిన లబ్ధిదారులు పూర్తి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- కుళాయి నీటిపైనే ఆధారం
- మౌలిక సౌకర్యాలూ అంతంతే..
- ఇబ్బందుల్లో లబ్ధిదారులు
- పట్టించుకోని అధికారులు
ధర్పల్లి, మే 23 : మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయంలో నీటి ఇబ్బందులు తప్పడంలేదు. వేసవికాలం కావడంతో తాగునీటి కోసం కాలనీవాసులు అల్లాడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మండల కేంద్రంలోని భీమ్గల్ రోడ్డులో ఉన్న మాలగుట్ట వద్ద 48 డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించారు. గతేడాది నవంబర్లో లాటరీ పద్ధతిన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లను కేటాయించారు. అయితే గృహప్రవేశాలు చేసుకొని ఇండ్లకు వచ్చిన లబ్ధిదారులు పూర్తి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండ్లు అందజేసి ఆరు నెలలు కావస్తున్నా పూర్తిస్థాయిలో నీరు, విద్యుత్ సౌకర్యం, మురికి కాలువల నిర్మాణం చేపట్టలేదు. ఈ విషయమై లబ్ధిదారులు అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితంలేకపోయిందని వాపోతున్నారు.
వేధిస్తున్న తాగునీటి సమస్య
ప్రధానంగా నీటి సదుపాయం లేక పోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండ్ల సముదాయం పక్కన ఉన్న కుళాయి నుంచి నీటిని తీసుకెళ్తున్నారు. ఆ కుళాయి నీరు కూడా అందరికీ సరిపోవడంలేదని వాపోతున్నారు. ఎండలు మండుతుండడంతో నీటి అవసరాలు మరింత ఎక్కువయ్యాయి. తాగునీటీతోపాటు,అవసరాలు తీర్చుకునేందుకు తీవ్ర ఇబ్బందిగా మారింది. డబుల్ బెడ్ రూం ఇండ్లలో పూర్తిస్థాయిలో వసతులు లేకపోవడంతో 48 మంది లబ్ధిదారుల నుంచి సుమారు 18 మంది ఇండ్లకు తాళాలు వేసుకుని వేరే చోటీకి వెళ్లి నివాసం ఉంటున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి నీటి సదుపాయం కల్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
వసతులు లేవు..
డబుల్ బెడ్ రూం ఇల్లు ఇచ్చిండ్రు అంటే ఇచ్చిండ్రు అంతే. అందులో ఎలాంటి వసతులులేవు. నీటి కోసమైతే చాలా బాధలు పడుతున్నాం. రోజూ డబుల్ బెడ్ రూం ఇండ్ల వెనక ఉన్న నల్లా నుంచి నీళ్లు మోసుకుంటున్నం.ఇప్పటికైనా సార్లు మాకు ముందుగాళ నీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం.
-సంకు ప్రమీల, డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారు, ధర్పల్లి
ఎవరికీ చెప్పినా పట్టించుకుంటలే..
డబుల్ బెడ్ రూం ఇండ్లల్లో ఎలాంటి వసతులు లేవు. దీంతో మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఎవరికీ చెప్పినా లాభం లేకుండా పోయింది. కొందరు ఇండ్లు ఇచ్చుడే ఎక్కువ అని మాట్లాడుతున్నరు. నీళ్ల కోసమైతే చాలా కష్టాలు పడుతున్నం. రోజూ మోసుకోలేక బాధపడుతున్నాం. ఆ నీళ్లు కూడా అందరికీ సరిపోతలేవు, సార్లు పెద్ద మనసు చేసుకుని మా బాధలు అర్థం చేసుకుని నీటి సమస్య తీర్చాలని కోరుతున్నాం..
-ఇప్ప బాబు, డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుడు, ధర్పల్లి
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

