మత్తులో టీనేజర్లు, యువకులే అధికం
గంజాయి మహమ్మారి గ్రామాలకు విస్తరించింది. పచ్చని పల్లెల్లో యువతను పీల్చి పిప్పిచేస్తున్నది. ప్రతి పల్లెలో కనీసం ఐదారుగురు గంజాయి బాధితులు ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అర్బన్ ప్రాంతాల నుంచి సులువుగా గ్రామాల్లోకి గంజాయి వస్తుండడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
- ప్రతి పల్లెలో పదుల సంఖ్యలో బాధితులు
- అర్బన్ ప్రాంతాల నుంచి గ్రామాల్లోకి రవాణా
- ‘స్టఫ్’ వంటి కోడ్ భాషల్లో క్రయ, విక్రయాలు
- పోలీసుల దాడుల్లో భారీగా పట్టుబడుతున్న వైనం
- గ్రామస్థాయి కమిటీలతో అవగాహన తప్పనిసరి
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): గంజాయి మహమ్మారి గ్రామాలకు విస్తరించింది. పచ్చని పల్లెల్లో యువతను పీల్చి పిప్పిచేస్తున్నది. ప్రతి పల్లెలో కనీసం ఐదారుగురు గంజాయి బాధితులు ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అర్బన్ ప్రాంతాల నుంచి సులువుగా గ్రామాల్లోకి గంజాయి వస్తుండడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులే గంజాయికి అలవాటు పడుతుండడం ఆందోళన కలిగించే అంశం. ఊరి చివర శ్మశానం, చెరువు గట్లు, స్కూళ్లు, రోడ్లు, రైల్వే ట్రాక్‌లలో అడ్డాలు ఏర్పాటు చేసుకొని.. సాయంత్రం కాగానే బ్యాచ్‌ల వారీగా చేరుకొని.. అంతా కలిసి గంజాయి తాగుతున్నారు. కొన్నిచోట్ల రోడ్లపైనే గంజాయి పీల్చుతూ.. నానా హంగామా చేస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లోని విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని గంజాయి బ్యాచ్‌లు రూ.500, రూ.1000కి గ్రాముల చొప్పుల గంజాయి విక్రయిస్తున్నాయి. కాలేజీల్లో చదువుతున్న గ్రామీణ యువకులకు స్నేహం ముసుగులో సిగరెట్, బ్రీజర్, బీర్ వంటివి అలవాటు చేసి, ఆ తర్వాత గంజాయి వినియోగించేలా ప్రోత్సహిస్తున్నట్లు స్వచ్ఛంద సంస్థల పరిశోధనలో వెల్లడైంది. ఇలా గంజాయి సేవిస్తున్న వారిలో టీనేజర్లే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది. యవ్వనంలో హుషారుగా ఉండాల్సిన వారు.. ఎదురురొమ్ము పీక్కపోయి, ముఖమంతా పాలిపోయి, కండ్లు గుంజుకుపోయి, బలం లేక బక్కచిక్కి.. గంజాయి వ్యసనంతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎదుగూబొదుగులేని బిడ్డలను చూసి, తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
గ్రామస్థాయిలో కమిటీలు వేస్తాం
సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచనల మేరకు పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది సమన్వయంతో అన్ని గ్రామాల్లో డ్రగ్స్ నిర్మూలన కమిటీలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఆ మేరకు కార్యాచరణ మొదలుపెట్టాం. డ్రగ్స్ అనర్థాలపై స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు అవగాహన కల్పించేలా విద్యాశాఖతో ఒప్పందం చేసుకుంటున్నాం. డ్రగ్స్‌కు బానిసైన వారిని దారిలోకి తెచ్చేందుకు రిహాబిలిటేషన్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. డ్రగ్స్ మహమ్మారిని తరిమేందుకు అందరూ కలిసిరావాలి.
– వీబీ కమలాసన్ రెడ్డి, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
‘స్టఫ్’ కోసం ఎంతదూరమైనా..
‘మాల్’ అనే కోడ్ గంజాయికి అని సులువుగా తెలిసిపోతుండడంతో.. ‘స్టఫ్’ అనే మరో కోడ్‌తో గంజాయి క్రయ, విక్రయాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో రైలుమార్గాలు ఉన్న గ్రామాల పరిధిలో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. తక్కువ మొత్తంలో రైళ్లలోనే ఎక్కువగా గంజాయి సరఫరా అవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గంజాయికి అలవాటు పడిన వారు.. స్టఫ్ కోసం ఎంతదూరమైనా వెళ్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లో ఎండు గంజాయి కాకుండా గంజాయి చాక్లెట్లు తింటూ మత్తులో జోగుతున్నారు. పోలీసులు, నార్కోటిక్ బ్యూరో, ఎక్సైజ్ సిబ్బంది నిర్వహిస్తున్న దాడుల్లో అధిక మొత్తంలో గంజాయి, గంజాయి ఆయిల్, చాక్లెట్లు పట్టుబడుతుండడం గమనార్హం. ఆరునెల్లలో 2682 కేజీల గంజాయి, 91 కేజీల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. 1.25 కేజీల హషీష్ ఆయిల్, 117.2 గ్రాముల చరస్, 6 కేజీల ఓపీఎం, 384.4 గ్రా. ఎండీఎంఏ, 80 గ్రా. హెరాయిన్‌ను ఎక్సైజ్ సిబ్బంది పట్టుకున్నారు. ఇక పోలీసులు, నార్కోటిక్ సిబ్బంది స్వాధీనం చేసుకుంటున్న డ్రగ్స్ విలువ కోట్లలో ఉంటున్నాయి.
ఉమ్మడి జిల్లాలో ఇలా..
- ఈ నెల 1వ తేదీన బాన్సువాడ పట్టణంలో గంజాయి విక్ర యిస్తున్న యువకుడిని పట్టుకొని 120గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే రోజు బోధన్‌లో ఓ మహిళ ఇంటి వద్ద 500 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
- 2వ తేదీన వేల్పూర్ మండల కేంద్రంలో ఓ యువకుడి వద్ద 210 గ్రాముల గంజాయిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టు కున్నారు. నిందితుడికి సరఫరా చేసే వ్యక్తిని పట్టుకునేందుకు యత్నించగా అధికారులను చూసి 2.10కిలోల గంజాయిని పారే సి పరారయ్యాడు.
- 3న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు సమీపంలో ఇద్దరు వ్యక్తుల వద్ద 6.10కిలోల గంజాయిని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ బృందం స్వాధీనం చేసుకున్నది
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

