బడికి వేళాయె సమస్యల స్వాగతం
కాసేపట్లో బడి గంట మోగనున్నది. పిల్లలు మళ్లీ బడిబాట పట్టనున్నారు. ఆటలు కట్టిపెట్టి పుస్తకాలతో కుస్తీ పట్టే సమయం వచ్చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పాఠశాల తరగతి గది తలుపులు తెరుచుకోనున్నాయి.
- అసంపూర్తిగా అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు
- యథేచ్ఛగా అనుమతిలేని ప్రైవేటు పాఠశాలల దందా
- పట్టించుకోని విద్యాశాఖ
- నేటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
ఖలీల్‌వాడి/ కామారెడ్డి, జూన్ 11: కాసేపట్లో బడి గంట మోగనున్నది. పిల్లలు మళ్లీ బడిబాట పట్టనున్నారు. ఆటలు కట్టిపెట్టి పుస్తకాలతో కుస్తీ పట్టే సమయం వచ్చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పాఠశాల తరగతి గది తలుపులు తెరుచుకోనున్నాయి. సెల్‌ఫోన్ గేమ్‌లు, మైదానాల్లో పరుగులు, వేసవి శిక్షణ శిబిరాల్లో బిజీగా గడిపిన పిల్లలను మళ్లీ స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు రెడీ అయ్యారు. ఉత్సాహంగా, రెట్టించిన ఆసక్తితో పిల్లలను పాఠశాలలకు వెళ్లేలా మానసికంగా సిద్ధం చేశారు.
ఇవ్వాల్టి నుంచి మళ్లీ బడి గంట వినిపించనున్నది. వేసవి సెలవుల అనంతరం విద్యాసంస్థలు తెరచుకోనున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తరగతులు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో ప్రైవేటు స్కూళ్లలో చదివే పిల్లల తల్లిదండ్రులు ఒకరోజు ముందుగానే విద్యార్థులకు సంబంధించిన యూనిఫామ్స్, షూస్, పుస్తకాలు తదితర సామగ్రిని కొనుగోలు చేశారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ చేరుకుంటున్నాయి. ఇదిలా ఉండగా ఒక వైపు పాఠశాలలు పునఃప్రారంభమవుతుంటే ఉపాధ్యాయులు బదిలీలు, ఉద్యోగోన్నతుల ఘట్టంలో బిజీగా ఉన్నారు. ఫైళ్లు పట్టుకొని మండల, జిల్లా విద్యాశాఖ కార్యాలయాల వెంట తిరుగుతున్నారు.
ప్రైవేటు గాలం.. పట్టించుకోని విద్యాశాఖ
ఉమ్మడి జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులకు గాలమేస్తున్నాయి. ఆకర్షణీయమైన ప్రకటనలు, కరపత్రాలు పంచుతూ అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. వేలల్లో డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. కొన్ని పాఠశాలలు అయితే అనుమతులు లేకపోయినా పిల్లలను చేర్పించుకుంటున్నాయి. ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్స్, టై, బెల్టు, షూస్ తదితర వాటిని యథేచ్ఛగా విక్రయిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. జిల్లాలో విద్యా వ్యాపారం జోరుగా సాగుతున్నా.. సంబంధిత శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థులు తల్లిదండ్రులతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు జీవో నంబరు 1 ప్రకారం గవర్నింగ్ బాడీ సమావేశాలు నిర్వహించి ఫీజులను నిర్ణయించాల్సి ఉంటుంది. సమావేశ తీర్మానాల ప్రకారం పాఠశాలలు నడుచుకోవాల్సి ఉంటుంది. కా నీ జిల్లాలో ఎక్కడా గవర్నింగ్ బాడీ సమావేశాలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవు.
ఈ విషయంలో అధికారులు శ్రద్ధ చూపడం లేదు. దీంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అధికారులను తమ చెప్పుచేతుల్లో ఉంచుకొని అధిక ఫీజులు, డొనేషన్లు పేరిట వసూళ్ల పర్వానికి తెరలేపినట్లు సమాచారం. ఇదే విషయమై జిల్లా విద్యాశాఖ అధికారిని వివరణ కోరగా తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని సమర్థించుకోవడం గమనార్హం. తమ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా తల్లిదండ్రులు ఈ విషయంలో ఫిర్యాదు చేయడం లేదు. ఈ అంశాన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేటు యాజమాన్యాలు ఎంతో కొంత ముట్టజెప్పి తమ దందా కొనసాగిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 600 వరకు ప్రైవేటు పాఠశాలలుండగా అనేక పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నవే. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
పూర్తికాని ‘ఆదర్శ’ పనులు
ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు, మరమ్మతులు చేయించేందుకు ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసింది. నిధులు సైతం విడుదల చేసింది. కానీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమో.. అధికారుల పర్యవేక్షణ లోపమో కానీ అసంపూర్తి పనులతో విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. సాక్షాత్తు కలెక్టర్‌తోపాటు డీఈవో సైతం తనిఖీలు చేస్తూ పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించినా నత్తనడకన సాగుతున్నాయి. కొన్ని పాఠశాలలను చూస్తుంటే తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. చెత్తాచెదారంతోపాటు పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి. మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం ఇంకా పూర్తికాలేదు. పలుచోట్ల ప్రహరీలు కూలిపోవడం, తలుపులు ధ్వంసమై కనిపిస్తున్నాయి. మరికొన్ని పాఠశాలలకు పైకప్పు కూడా వేయలేదు.
ఏర్పాట్లు చేశాం..
నెలన్నర నుంచి వేసవి సెలవు లు ప్రకటించడంతో పాఠశాలలు మూతబడ్డాయి. బుధవా రం పునఃప్రారంభం కానుండడంతో పాఠశాలలను శుభ్రం చేయి స్తున్నాం. విద్యార్థులకు ఎలాం టి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.
-రాజు, డీఈవో, కామారెడ్డి
ఫిట్నెస్ తప్పనిసరి..
ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తప్పనిసరిగా బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించాలి. ఫిట్నెస్ ఉన్న వాటినే నడిపించాలి. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు విద్యాసంస్థలకు 712 బస్సులు ఉండగా 450 బస్సులే ఫిట్నెస్ పరీక్షలు పూర్తిచేసుకున్నాయి. మిగతా వాహనాలు త్వరగా పరీక్షలు చేయించుకోవాలి. లేకపోతే బస్సులను సీజ్ చేస్తాం.
– ఉమామహేశ్వర్ రావు, జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, నిజామాబాద్
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

