కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం
జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ దుర్ఘటన కామారెడ్డి శివారులోని క్యాసంపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది.
- ఆగి ఉన్న లారీనీ ఢీకొన్న ప్రైవేటు బస్సు
- ఒకరు మృతి.. పలువురికి తీవ్రగాయాలు
కామారెడ్డి, జూన్ 25: జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ దుర్ఘటన కామారెడ్డి శివారులోని క్యాసంపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు డైమండ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రయాణికులతో వెళ్తున్నది. ఉదయం 3గంటల సమయంలో క్యాసంపల్లికి వద్ద జాతీయ రహదారిపై ఎలాంటి సూచికబోర్డు (ఇండికేటర్స్) పెట్టకుండా నిలిపి ఉంచిన లారీని ఢీకొట్టింది.
ప్రమాదంలో ఆదిలాబాద్‌లోని అంబేద్కర్‌నగర్ కాలనీకి చెందిన అప్సర్‌ఖాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్ షేక్ రఫత్‌కు కుడికాలు విరగగా.. మరో వ్యక్తి మోబిన్, బస్సు క్లీనర్ ఆయూబ్లతోపాటు మరికొంత మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 34మంది ప్రయాణికులు ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

