‘వైరల్’.. ఫీవర్
వాతావరణంలో రకరకాల మార్పులు వస్తున్నాయి. వాతావరణ మార్పులకు ఆరోగ్య సంరక్షణ మరింత అవసరం. ఈ రోజుల్లో కొంచెం నిర్లక్ష్యం చేయడంతో ఆరోగ్య దెబ్బతింటుంది. మారుతున్న వాతావరణం.. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై తక్షణ ప్రభావం చూపుతుంది. గత రెండు రోజులుగా వానలు కురుస్తుండడంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉదయం వర్షం, మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వర్షం.. ఇలా వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతో వైరల్ ఫీవర్ దాడి చేసే
వాతావరణ మార్పులతో పిల్లలకు జ్వరాలు
సీజనల్వ్యాధులపై అప్రమత్తత తప్పనిసరి
చిన్నారులు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు అవసరం
పరిశుభ్రతే శ్రీరామరక్ష : ప్రముఖ వైద్యులు
ఖలీల్వాడి, జూన్ 22 : వాతావరణంలో రకరకాల మార్పులు వస్తున్నాయి. వాతావరణ మార్పులకు ఆరోగ్య సంరక్షణ మరింత అవసరం. ఈ రోజుల్లో కొంచెం నిర్లక్ష్యం చేయడంతో ఆరోగ్య దెబ్బతింటుంది. మారుతున్న వాతావరణం.. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై తక్షణ ప్రభావం చూపుతుంది. గత రెండు రోజులుగా వానలు కురుస్తుండడంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉదయం వర్షం, మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వర్షం.. ఇలా వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతో వైరల్ ఫీవర్ దాడి చేసే అవకాశమున్నది. దీంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఒక సీజన్ నుంచి మరో సీజన్లోకి ప్రవేశించే ముందు రకరకాల ఇన్ఫెక్షన్లు సులభంగా దాడి చేస్తాయని, చల్లగా ఉన్న వాతావరణం వైరస్ల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ సీజన్లో ప్రతి పది మందిలో ఒకరికి జలుబు, జ్వరంతో కూడిన వైరల్ ఇన్ఫెక్షన్లు కనిపిస్తుంటాయని సరైన జాగ్రత్తలు పాటిస్తే వైరల్ ఫీవర్ రాకుండా ఉండగలమని వివరిస్తున్నారు.
వైరల్ ఫీవర్ లక్షణాలు..
వైరల్ జ్వరానికి సంబంధించిన లక్షణాలు ఇన్ఫెక్షన్ల రకాల మేరకు మారతాయి. జ్వరం 103-104 డిగ్రీలు దాటొచ్చు. తలనొప్పి. గొంతునొప్పి. ముక్కుకారడం, కండరాల నొప్పి, కీళ్లనొప్పి, డీహైడ్రేషన్, డయేరియా, వికారం, వాంతులు,అలసట, కళ్లు తిరగడం, చలి, కండ్లు ఎర్రబారడం, ముఖవాపు, చర్మంపై దద్దుర్లు, ఆకలి లేకపోవడం. సాధారణంగా వైరల్ జ్వరం నిర్ణీత కాలపరిమితిలో దానంతట అదే తగ్గిపోతుంది. అయినప్పటికీ లక్షణాలు కొనసాగితే వైద్యుడిని సంప్రదించాలి.

వైరల్ జ్వరానికి కారణాలు..
శరీరంపై దాడిచేసే వైరస్ రకాల మేరకు వైరల్ జ్వరానికి కారణాలు మారుతాయి.
- వైరల్ జ్వరం ఉన్న వ్యక్తితో సన్నిహితంగా ఉండడంతో మరొకరికి వ్యాప్తి చెందుతుంది.
- వైరల్ సోకిన వ్యక్తితో ఆహారం లేదా పానీయాలను పంచుకోవడం ద్వారా వ్యాప్తి చెందుతుంది.
- కలుషితమైన నీరు వైరల్ జ్వరానికి, మరీ ముఖ్యంగా పిల్లల్లో ఒక కారణం.
- జంతువులు, కీటకాల ద్వారా వైరల్ జ్వరాన్ని కలిగించే వైరస్ మానవులకు వ్యాప్తి చెందుతుంది. డెంగీ, ఎల్లో ఫీవర్, చికున్ గున్యాలు జంతువులు, కీటకాల ద్వారా వ్యాప్తి చెందే వైరల్ ఇన్ఫెక్షన్లు.
వైరల్ జ్వరం వచ్చినప్పుడు చేయాల్సినవి..
- సరైన విశ్రాంతి తీసుకోవాలి.
- ఎక్కువ ద్రవపదార్థాలు తాగాలి.
- తేలికగా జీర్ణమయ్యే భోజనాన్ని తినాలి.
- డాక్టర్ రాసిన మందులనే వాడాలి.
- వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
- చేతి రుమాలు, బట్టలు, టవల్స్, ఆహారం తదితర వాటిని విడిగా ఉంచుకోండి.దీంతో మీ ద్వారా వైరల్ ఇన్ఫెక్షన్ ఇతరులకు సోకకుండా ఉంటుంది.
వైరల్ జ్వరం వచ్చినప్పుడు చేయకూడనివి..
- స్వీయ వైద్యం చేసుకోవద్దు.
- చాలా చలిగా, చాలా వేడిగా ఉండే ప్రాంతాల్లో ఉండొద్దు.
- చలిగా అనిపిస్తే ఎక్కువ దుప్పట్లు ఉపయోగించొద్దు.
పాటించాల్సిన జాగ్రత్తలు
- తరచూ చేతులను కడుక్కోవాలి. శానిటైజ్ చేసుకోవాలి. ముఖం, ముక్కును తాకొద్దు.
- ఆరోగ్యకరమైన, వెచ్చని ఆహారాన్ని తినాలి.
- దోమ తెరలు ఉపయోగించాలి.
వాతావరణ మార్పులతోనే..
వాతావరణం చల్లబడడంతో వైరల్ ఫీవర్ వస్తుంది. వెంటనే డాక్టర్ను సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలి. మూడు రోజుల వరకు వైరల్ ఫీవర్ ఉంటుంది. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. దగ్గర్లోని పీహెచ్సీ, యూపీహెచ్సీ సెంటర్లలో కూడా డాక్టర్లను సంప్రదించి మాత్రలను వాడొచ్చు. ప్రతి సెంటర్లో మందులు అందుబాటులో ఉన్నాయి.
– డాక్టర్ సుదర్శనం, డీఎంహెచ్వో,నిజామాబాద్
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | అన్నదాతతో సర్కార్ ఆటలు.. కరువు సమీక్షకు పిలిచి.. తీరా రైతులు వచ్చాక మీటింగ్ రద్దు
Bigg Boss 10 | ఆరో వారంలో నామినేషన్ల మంటలు.. రోహిత్ వర్సెస్ వంశీ, అమన్ వర్సెస్ ముకేశ్!
హరీశ్రావు మామకు హైకోర్టులో ఊరట.. హనుమంతరావు భూమి స్వాధీనంపై చర్యలొద్దని ఆదేశాలు
Indiramma Illu | ఆశలు కూల్చిన ‘ఇందిరమ్మ’!.. పాత ఇల్లు కూల్చేయడంతో నిలువనీడ లేక.. ఖాళీ స్థలంలోనే తల్లి అంత్యక్రియలు!
Thummala Nageshwara Rao | యాసంగిలో వరి వేయొద్దు.. రైతులకు తుమ్మల నాగేశ్వరరావు సూచన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

