కాసేపట్లో కొడుకు పెండ్లి..
పెండ్లికి వెళ్తున్న ఓ కారు కల్వర్టును ఢీకొనగా, వరుడి తల్లిదండ్రులతోపాటు బంధువులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామ శివారులో బుధవారం చోటుచేసుకున్నది. రాజంపేట మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన చిదుర సిద్ధి రాములు-వినోద దంపతుల కుమారుడు చిదుర భరత్ వివాహం కామారెడ్డి పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాలులో ఏర్పాటు చేశారు.
- రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులతోపాటు బంధువులకు గాయాలు
- దవాఖానకు తరలింపు
- ఫంక్షన్హాలుకు వస్తుండగా కల్వర్టును ఢీకొన్న కారు
- చిన్నమల్లారెడ్డి శివారులో ఘటన
కామారెడ్డి, మే 6 : పెండ్లికి వెళ్తున్న ఓ కారు కల్వర్టును ఢీకొనగా, వరుడి తల్లిదండ్రులతోపాటు బంధువులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామ శివారులో బుధవారం చోటుచేసుకున్నది. రాజంపేట మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన చిదుర సిద్ధి రాములు-వినోద దంపతుల కుమారుడు చిదుర భరత్ వివాహం కామారెడ్డి పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాలులో ఏర్పాటు చేశారు. పెండ్లి కొడుకు తల్లిదండ్రులతోపాటు మేనత్తలు, ముగ్గురు చిన్నారులు మొత్తం 8మంది ఫంక్షన్హాలుకు కారులో బయల్దేరారు.
మార్గమధ్యంలో కామారెడ్డి మండలం చిన్నామల్లారెడ్డి గ్రామ శివారులో కారు రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును బలంగా ఢీకొన్నది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జుకాగా, కారులో ఉన్న పెండ్లి కొడుకు తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. మేనత్త మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను పట్టణంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ఇందులో ఒకరి పరిస్ధితి సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. కల్వర్టు పక్కనే ట్రాన్స్ఫార్మర్ కూడా ఉన్నది. ఒకవేళ కల్వర్టును కాకుండా ట్రాన్సఫార్మర్ను ఢీకొని ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేది. ఒక పక్క విషాద ఘటన చోటుచేసుకోగా, మరోవైపు తల్లిదండ్రులు లేకుండానే వివాహం జరిపించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

