Minister Seethakka | మంత్రి సీతక్క పర్యటన సందర్భంగా బాన్సువాడలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్టు
బాన్సువాడ డివిజన్ కేంద్రంతో పాటు మండలంలోని పాలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్న మంత్రి సీతక్క పర్యటన నేపథ్యంలో పట్టణ పోలీసులు మంగళవారం బీఆర్ఎస్ నాయకులతో పాటు సొత పార్టీ అయిన కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు.
Minister Seethakka | బాన్సువాడ, అక్టోబర్ 27 : బాన్సువాడ డివిజన్ కేంద్రంతో పాటు మండలంలోని పాలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్న మంత్రి సీతక్క పర్యటన నేపథ్యంలో పట్టణ పోలీసులు మంగళవారం బీఆర్ఎస్ నాయకులతో పాటు సొత పార్టీ అయిన కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ జుబేర్ మాట్లాడుతూ కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని తెలుసుకుని హామీలను నెరవేర్చడంలో లేని దృష్టి అక్రమ అరెస్టులపై పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని అన్నారు. వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంత మంది నాయకులను అరెస్టు చేయడంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు బయటపడినట్లైంది. అరెస్టయిన వారిలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ వార్డు సభ్యుడు మోచి గణేష్, ఖలీల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి గణేష్, కొత్తకొండ భాస్కర్, మాసాని శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి, దేవేందర్ రెడ్డి, జరుపాల్ మోతిలాల్, తారానాయక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sigma | ఓటీటీలోకి విజయ్ కొడుకు తొలి సినిమా.. సందీప్ కిషన్ ‘సిగ్మా’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
India-A Vs New Zealand-A: డ్రాగా ముగిసిన ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ మ్యాచ్
Aadarsha Kutumbam | సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆదర్శ కుటుంబం’.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడే!
పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండలో భారీ బైక్ ర్యాలీ
Naga Chaitanya | నాగచైతన్య కెరీర్లోనే భారీ డీల్.. రూ.45 కోట్లకు ‘వృషకర్మ’ హక్కులు?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

