Parthasarathy | పట్టుదలతో కృషి చేస్తే అద్భుత విజయాలు : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి
Parthasarathy | యువకులు అదృష్టం పై ఆధారపడకుండా ఏకాగ్రత, పట్టుదలతో కృషి చేస్తే ఉన్నత అవకాశాలు, అద్భుత విజయాలు సాధించవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి (Parthasarathy ) అన్నారు.
నిజామాబాద్ : యువకులు అదృష్టం పై ఆధారపడకుండా ఏకాగ్రత, పట్టుదలతో కృషి చేస్తే ఉన్నత అవకాశాలు, అద్భుత విజయాలు సాధించవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి (Parthasarathy ) అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో శనివారం చిట్ల ప్రమీల జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డుల (Awards) ను అందజేశారు. పదవ తరగతి వార్షిక పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన ఆర్మూర్ పట్టణంలోని నాలుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులకు తన తల్లిదండ్రుల పేరిట నెలకొల్పిన ట్రస్టు ఆధ్వర్యంలో అవార్డులను అందజేస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగే వాతావరణం, ఆలోచనా తీరుపైనే మేధస్సు అనేది ఆధారపడి ఉంటుందని, సానుకూల దృక్పథంతో ప్రణాళికాబద్ధంగా శ్రమిస్తే విజయం (Success) తథ్యమని సూచించారు. సమాజానికి సరైన దశా,దిశా చూపే గురుతర (Teachers) బాధ్యత కలిగిన గురువులు విద్యార్థుల భవితవ్యాన్ని తీర్చిదిద్ధేందుకు అంకిత భావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. కౌమార దశ ఎంతో సున్నితమైందని, ఈ వయసులోని పిల్లలను సరైన దిశగా ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు.
ప్రతి ఒక్కరి జీవితంలో విద్య ఎంతో ప్రాముఖ్యమైనదని, విద్యతోనే సమాజంలో తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయని, విలువను పెంపొందించుకోగల్గుతామని మార్గనిర్దేశం చేశారు. చదువుకు అడ్డంకిగా మారే సెల్ ఫోన్ (Cell Phones), సినిమాలు (Cinemas) , సీరియళ్లు (Serials) వంటి వాటికి బానిసలుగా మారవద్దని సూచించారు. ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని పక్కా ప్రణాళికతో కృషి చేయాలన్నారు.
క్రమశిక్షణను అలవర్చుకుని, ఏ రోజు పాఠాన్ని ఆ రోజే పునఃశ్చరణ చేసుకోవాలని, వాయిదా వేసే జాడ్యాన్ని విడనాడాలని సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు, యువత సైతం తమ సృజనాత్మక శక్తిని పెంపొందించుకుని నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని ఆయన కోరారు. పేదరికం, మారుమూల ప్రాంతం వంటి కారణాలను మనసులో పెట్టుకుని ఆత్మన్యూనతకు గురికావద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆర్మూర్ ఆర్డీవో వినోద్ కుమార్, విద్యా శాఖ పరీక్షల విభాగం సహాయ కమిషనర్ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

