21 నీట్ యూజీ పరీక్షా
కమిషనరేట్ పరిధిలో ఈనెల 21న రీ-ఎగ్జామినేషన్ ఆఫ్ నేషనల్ ఎలిజిటిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, నీట్ యూజీ -2026 నిర్వహించనున్నట్లు కామారెడ్డి ఎస్పీ, నిజామాబాద్ ఇన్చార్జి సీపీ రాజేశ్ చంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎగ్జామ్స్ సెంటర్స్ వద్ద పోలీసులు అవసరమైన భద్రత చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
- కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలు
- ఇన్చార్జి సీపీ రాజేశ్చంద్ర వెల్లడి
వినాయక్‌నగర్, జూన్ 12: కమిషనరేట్ పరిధిలో ఈనెల 21న రీ-ఎగ్జామినేషన్ ఆఫ్ నేషనల్ ఎలిజిటిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, నీట్ యూజీ -2026 నిర్వహించనున్నట్లు కామారెడ్డి ఎస్పీ, నిజామాబాద్ ఇన్చార్జి సీపీ రాజేశ్ చంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎగ్జామ్స్ సెంటర్స్ వద్ద పోలీసులు అవసరమైన భద్రత చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుందని తెలిపారు. పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు రెండు షిప్ట్లుగా నిర్వహిస్తారని పేర్కొన్నారు.
పరీక్ష రోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జామ్ సెంటర్ల పరిసర ప్రాంతా ల్లో సెక్షన్ 163 అమలులో ఉంటుందని వెల్లడించారు. 100 మీటర్ల పరిధిలో ఇద్దరికి మించి గుంపుగా ఉండరాదని సూచించారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ షాప్స్ మూసి ఉంచాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సెంటర్ల వద్ద అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచుతామని వెల్లడించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
పరీక్షా కేంద్రాలు ఇవే..
1. ఏవీ ఎంటర్ప్రైజెస్, అర్సపల్లి
2. టీయూ ఆర్ట్ అండ్ సైన్స్ భవనం, డిచ్పల్లి
3.టీయూ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, డిచ్పల్లి
4. ప్రభుత్వ జూనియర్ కళాశాల,బోధన్
5) ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బోధన్
6) ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నిజామాబాద్
7) బిగాల కృష్ణమూర్తి జడ్పీహెచ్ఎస్, మాక్లూర్
8) తెలంగాణ మైనార్టీ స్కూల్ ఆఫ్ రెసిడెన్సీ గర్ల్స్, మైనార్టీ పాఠశాల ఆఫ్ జూనియర్ కాలేజీ ఫర్ గర్ల్స్ , నాగారం
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

