కామారెడ్డి : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రం శివారులోని కామారెడ్డి – సిరిసిల్ల రహదారిపై రన్నింగ్లో ఉన్న కారు దగ్ధమైంది. కారులోంచి ఒక్కసారిగా పొగలు రావడంతో అప్రమత్తమై డ్రైవర్ శ్రీనివాస్ గౌడ్ కారును పక్కన నిలిపివేసి పోలీసులు, ఫైర్ సిబ్బందికి సచామారమిచ్చాడు.
సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.