కల్యాణలక్ష్మి చెక్కుతోపాటు తులం బంగారం ఇవ్వాలి
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులకు రూ.లక్షా116తోపాటు తులం బంగారం ఇవ్వాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్‌రెడ్డి మాటిచ్చిన విధంగా తులం బంగారం ఇవ్వాలన్నారు.
- మాటిచ్చిన సీఎం ఏడు నెలలైనా ఆచరణలో పెట్టలేదు
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
భీమ్‌గల్, జూలై 15: కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులకు రూ.లక్షా116తోపాటు తులం బంగారం ఇవ్వాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్‌రెడ్డి మాటిచ్చిన విధంగా తులం బంగారం ఇవ్వాలన్నారు. భీమ్‌గల్ మండల కేంద్రంలోని బంజారా భవన్లో సోమవారం నియోజకవర్గంలోని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులు 136 మందికి చెక్కులను ఎమ్మెల్యే వేముల పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపొందడానికి సీఎం రేవంత్‌రెడ్డి తులం బంగారం ఇస్తామన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడిచినా ఇచ్చిన హామీ అమలులోకి రాలేదని మండిపడ్డారు.
అప్పులు చేసి పేదింటి ఆడబిడ్డల పెండ్లి చేశారన్నారు. చెక్కుతోపాటు తులం బంగారం ఇస్తారన్న ఆశతో తల్లిదండ్రులు వచ్చారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రూ.లక్షా116 చెక్కు మాత్రమే ఇస్తున్నారని, తులం బంగారం ఇవ్వలేదని లబ్ధిదారులు నిరాశతో వెళ్లారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఇచ్చిన రూ.లక్ష చెక్కుతోపాటు తులం బంగారం ఇవ్వాలని ఎమ్మెల్యే వేముల డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కన్నే ప్రేమలతాసురేందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, మాజీ ఎంపీపీ మహేశ్, మాజీ జడ్పీటీసీ రవి, కౌన్సిలర్లు లింబాద్రి, నర్సయ్య, గంగాధర్, ఖైరున్నిసా బేగం, షమీంబేగం, సతీశ్, లింగయ్య, మలెల్ల ప్రసాద్, కోఆప్షన్ సభ్యులు నవీన్, అజ్మత్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

