యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. మండలంలోని నిజాంపూర్ వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుక అక్రమంగా తరలించడం గమనార్హం. కొన్నిరోజులుగా నిజాంపూర్ వాగులో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు.
- ఇందిరమ్మ ఇండ్ల పేరిట తరలింపు
- పట్టించుకోని సంబంధిత అధికారులు
నవీపేట, మే 31: మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. మండలంలోని నిజాంపూర్ వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుక అక్రమంగా తరలించడం గమనార్హం. కొన్నిరోజులుగా నిజాంపూర్ వాగులో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఇందిరమ్మ ఇండ్ల పేరిట ట్రాక్టర్లలో ఇసుక రవాణా చేస్తున్నారు.
వాగు నుంచి ఇసుకను ఉదయం నుంచి సాయంత్రం వరకు తరలిస్తున్నా, సంబంధిత అధికారులు కనీసం ఇటు వైపు కన్నెత్తి సైతం చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. నిజాంపూర్ వాగులో అనధికార పాయింట్ ద్వారా అక్రమార్కులు ఇసుక దందా సాగిస్తున్నారు.రెవెన్యూ, పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టిసారించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఇసుక అక్రమ రవాణాపై స్థానిక తహసీలార్ద్ వెంకటరమణను వివరణ కోరేందుకు ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులో లేరు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Sharmila | బెంగళూరులోని యలహంక ప్యాలెస్ నా బిడ్డల హక్కు : వైఎస్ షర్మిల
Drinking Water | రాష్ట్రంలో మొదలైన తాగునీటి కష్టాలు.. ఈ దృశ్యాలు చూశారా..?
Jailer 2 | రజనీకాంత్ ‘జైలర్ 2’ అరుదైన రికార్డు.. రూ.800 కోట్ల దిశగా పరుగులు, నాలుగు రాష్ట్రాల్లో సరికొత్త చరిత్ర!
YS Sharmila | యలహంక ఇంట్లో నా కుమార్తె పెళ్లి జరగట్లేదు.. వేరే చోట నిర్వహిస్తున్నాం: వైఎస్ షర్మిల
Vettuvam | పా. రంజిత్ ‘వేట్టువం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి 2027 బరిలో భారీ యాక్షన్ ఎపిక్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

