కాకర ఆరోగ్యానికి ఆసరా..
కాకరకాయ చూడగానే ఆబ్బో చేదు అని ముఖం తిప్పేసుకుంటాం. మరికొందరు నచ్చకపోయి నా ఆరోగ్యానికి మేలు చేస్తుందని తింటా రు. దాని విలువ తెలిసిన వారే ఇష్టంగా ఆరగిస్తారు. ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలున్న కాకర రక్తపోటు, కంటి సమస్యలను నివారిస్తుంది. మధుమేహం, మొ లలు, మలబద్ధకాన్ని అరికడుతుంది
- రక్తపోటు, కంటి సమస్యల నివారిణి
- మధుమేహం, పైల్స్, మలబద్ధకానికి విరుగుడు
భిక్కనూర్, అక్టోబర్ 28: కాకరకాయ చూడగానే ఆబ్బో చేదు అని ముఖం తిప్పేసుకుంటాం. మరికొందరు నచ్చకపోయి నా ఆరోగ్యానికి మేలు చేస్తుందని తింటా రు. దాని విలువ తెలిసిన వారే ఇష్టంగా ఆరగిస్తారు. ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలున్న కాకర రక్తపోటు, కంటి సమస్యలను నివారిస్తుంది. మధుమేహం, మొ లలు, మలబద్ధకాన్ని అరికడుతుంది. శరీరంలో వ్యర్థాలను తొలగించేందుకు దోహదపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపర్చి చర్మవ్యాధులను దూరం చేస్తుంది. పల్లెల్లో ప్రతి ఇంటి పెరట్లోనూ కాకరకాయ తీగలతో పొదలుండేవి.. ప్రత్యేకంగా పందిరి వేసి పెంచేవారు.
కాకరకాయతో లాభాలు
- కాకరకాయలో విటమిన్ ఏ, బీ1, బీ2, సీ ఉంటాయి. కాల్షియం, ఐరన్, పొటాషియం, కాపర్ లభిస్తాయి.
- రక్త కణజాలాన్ని శుభ్రపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాలేయాన్ని ఉత్తేజపరుస్తుంది. చర్మానికి మేలు చేస్తుంది.
- ఆకలి పెంచే శక్తి కాకరకు ఉంది. ఉదర సంబంధిత సమ్యలను నివారిస్తుంది. శరీరంలో చిన్నచిన్న వాపులను తగ్గించి అంతర్గత గాయాలను మాన్పుతుంది.
- శరీరానికి పట్టిన అధిక నీటిని తొలగిస్తుంది. అధిక రక్తపోటు, కంటి సమస్యలను, నాడీ సంబంధిత ఇబ్బందులను దూరం చేస్తుంది. జీర్ణంలో కలిగే మార్పును సరిదిద్దుతుంది.
- కాకరలో ైగ్లెకోసైడ్లు, ఫీనోలిక్స్ ,ఆల్కలాయిడ్స్, తైలాలు తదితర 17రకాల ఆమైనో ఆమ్లాలు లభిస్త్తాయి.
- మధుమేహ వ్యాధి విరుగుడుకు కాకరను వాడతారు. కాకరలో ఇన్సూలిన్ ఉంది. దీని ప్రభావంతో రక్తం, మూత్రంలో చేరిన చక్కెర అధిక నిల్వలు తగ్గుతాయి. ఇందుకోసమైనా కాకరను ఆహారంలో తరుచూ తీసుకోవాలి.
- లేత కాకరకాయ ఆకుల రసం మొలలు (పైల్స్)కి విరుగుడుగా పనిచేస్తుంది.
- కాకర వేర్లను మెత్తగా నూరి ముద్ద చేసి మొలలపై రాస్తే ఉపశమనం ఉంటుంది.
- కడుపులో గ్యాస్ రానివ్వకుండా కాకరకాయ దోహదపడుతుంది. రక్తంలో మలినాలను తొలగిస్తుంది.
- రక్తపు గడ్డలు, దురద, గజ్జి, తామర, ఫంగస్ వాధ్యులన్నింటికీ కాకర మందుగా పనిచేస్తుంది.
- కాకర వేర్లను మెత్తగా నూరి ముద్దగా చేసి చెంచాడు తేనెతో కలిపి రోజు రాత్రిపూట తీసుకుంటే ఆస్తమా, జలుబు, శ్వాసనాళ ఇబ్బందులు తొలగిపోతాయి.

మార్కెట్లో మంచి డిమాండ్
కాకరకాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. మూడేండ్లుగా సాగు చేస్తున్నాను. ఆరుతడి పంట. తక్కువ పెట్టుబడితో మంచి ధర వస్తున్నది. కాకరకాయతో ఎన్నోరకాల వ్యాధులను నయం చేయవచ్చు.
– రఘుపతిరెడ్డి, రైతు, ర్యాగట్లపల్లి
సర్వరోగాల నివారణకు దోహదపడుతుంది
కాకరకాయ వంటను కనీసం వారానికి 2 రోజులు తీసుకుంటే పోషకాలతోపాటు సర్వరోగాలు దరిచేరకుండా చూస్తుంది. రక్తపోటు, కంటి సమస్యలు, మధుమేహం, పైల్స్, మలబద్ధకం నివారణకు ఉపయోగపడుతుంది.
– దివ్య, మండల వైద్యాధికారి, భిక్కనూర్
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

