Distribution SIR forms | కామారెడ్డి/పిట్లం, జులై 3 : ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా పిట్లం మండలంలో BLOలు ఇంటింటికీ వెళ్లి SIR దరఖాస్తు ఫారాలను పంపిణీ చేస్తున్నారు. ఓటర్లకు ఫారాల వినియోగ విధానాన్ని వివరించడంతో పాటు, అర్హులైన ప్రతీ ఒక్కరూ తమ వ్యక్తిగత వివరాలను సరిచూసుకుని అవసరమైన ఆధార పత్రాలతో నిర్ణీత గడువులోగా BLOలు లేదా సంబంధిత ఎన్నికల అధికారులకు సమర్పించాలని సూచిస్తున్నారు.
ఈ ప్రత్యేక సవరణ ద్వారా కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ, చిరునామా మార్పులు వంటి ప్రక్రియలు పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతీ అర్హత గల ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.