నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఇంటిపై దాడి
డి శ్రీనివాస్ తనయులు సంజయ్, అరవింద్‌ల మధ్య విభేదాలు మరోసారి బయట పడ్డాయి. ఇవాళ సంజయ్ ఇంటిపై సందీప్ వర్మ అనే వ్యక్తి దాడి చేశాడు. ఇది అరవింద్ పనే అని సంజయ్ తెలిపారు. దీనిపై సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఇంటి వద్ద సందీప్ వర్మ అనే వ్యక్తి హంగామా సృష్టించాడు. కారుతో ఇంటి గేటు, వాహనాలను ధ్వంసం చేశాడు. సుమారు 20 నిమిషాలపాటు సందీవ్ వర్మ రచ్చ రచ్చ చేశాడు. అసలు ఏం జరగుతుందో తెలియక సంజయ్ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. సంజయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇద్దురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
గత కొంత కాలంగా డీఎస్ తనయులు అరవింద్, సంజయ్‌ల మధ్య విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరికీ రాజకీయంగా పడట్లేదు. తండ్రి డి శ్రీనివాస్‌తోపాటు సంజయ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే సంజయ్ తమ్ముడు, బీజేపీ ఎంపీ అరవింద్‌కు ఇది నచ్చట్లేదు. తండ్రిపై ఒత్తిడి తీసుకొచ్చి మరుసటి రోజే కాంగ్రెస్‌కు రాజీనామా చేయించారు. దీన్నంతా అరవింద్ కుట్రగా సంజయ్ చెప్పారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

