Jukkal | కంఠలిలో ఘనంగా అన్న బహు సాటే జయంతి వేడుకలు
జుక్కల్ మండలంలోని కంఠలి గ్రామం లో గ్రామ సర్పంచ్ గౌలే నాగనాథ్ అధ్యక్షతన సాహిత్య రత్న, లోక్ షాహిర్ డాక్టర్. అన్న బహు సాటే 106 వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
Jukkal | జుక్కల్ : జుక్కల్ మండలంలోని కంఠలి గ్రామం లో గ్రామ సర్పంచ్ గౌలే నాగనాథ్ అధ్యక్షతన సాహిత్య రత్న, లోక్ షాహిర్ డాక్టర్ అన్న బహు సాటే 106 వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్న బహు సాటే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు సూర్యావంశీ యాదవ్ మాట్లాడుతూ డాక్టర్ అన్న బహు సాటే సామాజిక సమానత్వం, దళితుల హక్కులు, కార్మికుల సంక్షేమం కోసం జీవితంతం పోరాడిన మహానుభాహుడని కొనియాడారు. ఆయన రచనలు, పాటలు, ప్రజా చైతన్య కార్యక్రమాలు సమాజంలో అణగారిన వర్గాలకు స్ఫూర్తినిచ్చాయని తెలిపారు.
గ్రామ సర్పంచ్ నాగనాథ్ మాట్లాడుతూ అన్న బహు సాటే ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకొని విద్య, సామాజిక చైతన్యం, సమానత్వ భావనతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శేఖ పూర్ సర్పంచ్ ఇబత్వర్ తూకరం, కంఠలి సర్పంచ్ నాగనాథ్, చిన్న తడ్గురు సర్పంచ్ సూర్యావంశీ ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గులని సాయిలు, మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త అయిల్వర్ రమేష్, భుజంగ్, రుశేగావు భూమయ్య, బోడ్కె హన్మంత్, గాయాక్వాడ్ విజయ్, శ్రీరంగ్, విట్టల్ పాటిల్, పీ నాగేశ్వర్ రావ్, ఎం సాయిలు, మారుతీ, గ్రామస్తులు, అన్న బహు సాటే యూత్ సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

