కొట్టేసిన సొమ్ము బెట్టింగ్‌లోకి..?
కస్టమర్ల ఖాతాల నుంచి రూ.కోట్లు కొల్లగొట్టి పరారైన యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొట్టేసిన డబ్బు ఏం చేశాడు.. ఎక్కడ దాచాడనే దానిపై ప్రశ్నిస్తున్నారు.
- స్టాక్మార్కెట్లోనూ పెట్టిన మేనేజర్!
- కోట్లు కొల్లగొట్టి పరారైన అజయ్
- అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
- ఠాణాకు తరలివచ్చిన బాధితులు
వినాయక నగర్, జూలై 22: కస్టమర్ల ఖాతాల నుంచి రూ.కోట్లు కొల్లగొట్టి పరారైన యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొట్టేసిన డబ్బు ఏం చేశాడు.. ఎక్కడ దాచాడనే దానిపై ప్రశ్నిస్తున్నారు. అయితే, బెట్టింగ్తో పాటు స్టాక్మార్కెట్లో పెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్.. రుణాల పేరిట 25 మంది కస్టమర్లను బురిడీ కొట్టించి రూ.4 కోట్లకు పైగా కాజేసిన సంగతి తెలిసిందే. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని నిజామాబాద్‌కు తరలించారు.
ఏసీపీ రాజావెంకటరెడ్డి పర్యవేక్షణలో సీఐ నరహరి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు అజయ్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు సమాచారం. అయితే, తన వద్ద ప్రస్తుతం డబ్బులు లేవని మేనేజర్ చెప్పినట్లు తెలిసింది. కాజేసిన సొమ్మును ఏం చేశాడనే కోణంలో ఆరా తీసేందుకు యత్నిస్తుండగా, నిందితుడు సహకరించలేదని సమాచారం. మరోవైపు, మేనేజర్‌ను పట్టుకొచ్చారని తెలిసిన బాధితులు ఉదయమే ఠాణా వద్దకు చేరుకున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు అక్కడే పడిగాపులు కాశారు. ఒక్కొక్కరిని ఏ విధంగా మోసగించాడో బాధితులు పోలీసుల వద్ద వెల్లడించారు. ముద్ర లోన్ కోసం ఓ వ్యక్తి సంప్రదించగా, డాక్యుమెంట్లు సహా అన్ని తాను చూసుకుంటానని చెప్పిన మేనేజర్ అజయ్.. రూ.8 లక్షల రుణం మంజూరయ్యేలా చూశాడు. అయితే, తనకు డబ్బు అవసరముందని, మూడు నెలల తర్వాత తిరిగి ఇస్తానని, అప్పటిదాకా వడ్డీ తానే చెల్లిస్తానని చెప్పి తీసుకున్నాడు. మిగతా బాధితులు వద్ద కూడా ఇలాగే సొమ్ము తీసుకున్నట్లు తెలిసింది.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

