జుట్టు.. అదిరేట్టు.. డిఫరెంట్ హెయిర్ ైస్టెల్స్పై యువత ఆసక్తి
యువతరం కొత్తదనాన్ని కోరుకుంటున్నది. చేసే ప్రతి పనిలోనూ వెరైటీ ఉండాలని చూస్తున్నది. అలాగే, హెయిర్ కటింగ్‌లోనూ కొత్తకొత్త ైస్టెల్స్ను అనుసరిస్తున్నది. అందరినీ ఆకట్టుకునేలా యువకులు డిఫరెంట్ ైస్టెల్స్లో కటింగ్ , షేవింగ్ చేయించుకుంటున్నారు. సినీ హీరోలు, సెలబ్రిటీలను ఫాలో అవుతున్నారు.
- నయా లుక్ కోసం తాపత్రాయం
- కుర్రకారులో కొత్త జోష్
- ట్రెండ్‌ను ఫాలో అవుతున్న యువత
యువతరం కొత్తదనాన్ని కోరుకుంటున్నది. చేసే ప్రతి పనిలోనూ వెరైటీ ఉండాలని చూస్తున్నది. అలాగే, హెయిర్ కటింగ్‌లోనూ కొత్తకొత్త ైస్టెల్స్ను అనుసరిస్తున్నది. అందరినీ ఆకట్టుకునేలా యువకులు డిఫరెంట్ ైస్టెల్స్లో కటింగ్ , షేవింగ్ చేయించుకుంటున్నారు. సినీ హీరోలు, సెలబ్రిటీలను ఫాలో అవుతున్నారు. పట్టణాలకే పరిమితమైన ఈ హెయిర్ ైస్టెల్స్ ట్రెండ్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించింది. పల్లెటూరి కుర్రకారు సైతం డిఫరెంట్ హెయిర్ స్టైల్స్‌లో త‘లుక్’మంటున్నారు.
బీబీపేట్, డిసెంబర్ 10: ఒకప్పుడు సినిమా హీరోలు, క్రికెటర్లు, సెలబ్రిటీలకే పరిమితమైన విభిన్న హెయిర్ ైస్టెల్స్ ఇప్పుడు పల్లెలకూ పాకింది. పలు రకాల హెయిర్ ైస్ట్టెల్స్తో కుర్రకారు సందడి చేస్తున్నారు. మొన్నటి వరకు నగరాలు, పట్టణాలకే పరిమితమై డిఫరెంట్ హెయిర్ కటింగ్ ఇప్పుడు గ్రామాలకూ విస్తరించింది. యువత అభిరుచి మేరకు సెలూన్ల నిర్వాహకులు సైతం ట్రెండింగ్ హెయిర్ ైస్టెల్‌ను ఫాలో అవుతున్నారు. చదువుకున్న యువకులే కాకుండా వివిధ పనులు చేస్తున్న వారుసైతం డిఫరెంట్ ైస్టెల్లో హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థి మొదలుకొని కాలేజీలకు వెళ్లే వారివరకు నయా లుక్ కోసం ఆసక్తి కనబరుస్తున్నారు. రోజుకో కొత్త ైస్టెల్ పుట్టుకొస్తుండడంతో ఫాలో అవుతున్నారు.
ైస్టెలిష్‌గా కనిపించేందుకు..
కొత్త హెయిర్ ైస్టెల్స్ను యువత స్వాగతిస్తున్నారు. పెప్, ఫంకీ, స్పైస్, లాంగ్ హెయిర్ స్ట్రెయిటింగ్, కర్లింగ్, జిగ్‌జాగ్, బిగ్‌షాట్ వంటి ైస్టెల్స్లో యువత అదరగొడుతున్నారు. ఫంకీ. పెప్ స్ట్రైయిటింగ్ హెయిర్ైస్టెల్స్పై యువత ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. సాధారణ కటింగ్, షేవింగ్ కన్నా డిఫరెంట్‌గా కనిపించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
స్ట్రెయిటింగ్ ైస్టెల్స్పై క్రేజ్..
ఖర్చుకు వెనకాడకుండా యువత తమకు నచ్చిన హెయిర్ ైస్టెల్స్ను సెలక్ట్ చేసుకుంటున్నారు. ఫంకీ, పెప్, స్టెప్, హెయిర్ ైస్టెల్స్కు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రాంతాలను బట్టి వీటీ ధర రూ.200 నుంచి 350 వరకు ఉన్నాయి. మోడలింగ్ హెయిర్ ైస్టెళ్లపై యువత అమితాసక్తి కనబరుస్తున్నారు. ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు భిన్న హెయిర్ ైస్టెల్స్‌తో ఆకట్టుకుంటున్నారు.
కోరుకున్న ైస్టెల్లో..
కళాశాల, పాఠశాల విద్యార్థులు కొత్త హెయిర్ ైస్టెల్స్ వైపు మక్కువ చూపుతున్నారు. రోజురోజుకూ యువ తలో క్రేజ్ పెరుగుతున్నది. కటింగ్ కోసం ఖర్చులకు వెనుకాడడంలేదు. ఇప్పుడు ఫంకీ, జిగ్‌జాగ్, స్ట్రైయిటింగ్ హెయిర్ ైస్టెళ్లకు ఆదరణ ఉన్నది. యువత అభిరుచి మేరకు భిన్న కటింగ్‌లు చేస్తున్నాం. చిన్న పిల్లలకు కూడా తల్లిదండ్రులు ైస్టెల్‌గా కటింగ్ చేయిస్తున్నారు.
– స్వామి, సెలూన్ నిర్వాహకుడు, బీబీపేట్
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
- Tags
- New hair style
- new look
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
Russia-Ukraine War | రష్యాపై వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. భారీగా మంటలు
Prakash Raj | 23న దేశవ్యాప్తంగా ప్రజామార్చ్.. ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ కూటమి పిలుపు
SIR | ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’! సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
India vs Zimbabwe T20I | అమ్మాయిలు అదుర్స్.. దంచికొట్టిన షెఫాలీ, మంధాన.. రెండో టీ20లో భారత్ ఘన విజయం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

