1. 2024, జనవరి 8న బిల్కిస్ బానో అత్యాచార కేసుపై సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి సరైన వాక్యం?
ఎ. జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఉజ్జయ్ భుయాన్‌ల ధర్మాసనం తీర్పు చెప్పింది
బి. తీర్పును మొత్తం 251 పేజీలతో వెలువరించింది
సి. 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం బిల్కిస్‌బానోపై అత్యాచారం జరిగింది, దీని దోషులు 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడగా, ఆ శిక్షను తగ్గిస్తూ గుజరాత్ ఉత్తర్వులు జారీ చేసింది
డి. ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఈ తీర్పులో సమర్థించలేదు
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
2. 2023, డిసెంబర్ 3న బద్దలయిన మరాపి అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది?
1) ఐస్లాండ్ 2) గ్రీన్లాండ్
3) ఇండోనేషియా 4) మలేషియా
3. కింది వాటిలో సరైనది?
ఎ. పాకిస్థాన్ సాధారణ ఎన్నికల్లో డా.సవీరా ప్రకాశ్ పోటీ చేశారు
బి. ఈమె ఖైబర్ పఖ్తుంక్వా నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన తొలి హిందూ మహిళ
సి. ఈమెను పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నామినేట్ చేసింది
డి. పాకిస్థాన్ ఎన్నికలు 2024, ఫిబ్రవరి 8న జరగనున్నాయి
1) ఎ, సి, డి 2) బి, సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
4. 2023, డిసెంబర్ 27న ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం/నిర్ణయాలు ఏవి?
ఎ. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో
భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఏర్పాటు
బి. ప్రసార మాధ్యమ రంగంలో సహకరించుకొనేందుకు భారతదేశం, మలేషియా దేశాల మధ్య కుదిరిన ఒప్పందానికి ఆమోదం
సి. 2024 సీజన్‌కు ఎండుకొబ్బరి మద్దతు ధర రూ.250లు, కురిడీ కొబ్బరి మద్దతు ధర రూ.300లు క్వింటాలు పెంచడానికి ఆమోదం తెలిపారు
డి. 2024 సీజన్‌కు ఎండుకొబ్బరి
క్వింటాల్ ధర రూ.11,160 కనీస ధర, కురిడీ కొబ్బరి క్వింటాల్ ధర
రూ.12,000గా నిర్ణయించారు
1) ఎ, బి, డి 2) ఎ, బి, సి, డి
3) ఎ, బి 4) బి, సి, డి
5. కింది వాటిలో సరైన వాక్యమేది?
ఎ. కేంద్ర ప్రభుత్వం 2023
డిసెంబర్లో ఆరు సమర్థ్ శిక్షణా
కార్యక్రమాలను ప్రారంభించింది
బి. ఈ ఆరు సమర్థ్ శిక్షణా కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినవి
సి. ఈ ఆరు సమర్థ్ శిక్షణా కార్యక్రమాలు iGOT కర్మయోగి ప్లాట్‌ఫాంపై
ప్రారంభించారు
1) ఎ, బి, సరైనవి, సి కాదు
2) ఎ, సి సరైనవి, బి కాదు
3) ఎ, బి, సి సరైనవి
4) ఎ సరైనది, బి, సి కాదు
6. భారతదేశం ‘వైకల్యం విభాగం’లో సహకరించుకొనేందుకు ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది?
1) సౌదీ అరేబియా 2) నమీబియా
3) దక్షిణాఫ్రికా 4) ఫ్రాన్స్
7. భారత రెజ్లింగ్ సమాఖ్య బాధ్యతలు చూసుకోవడానికి భారత ఒలింపిక్ సంఘం నియమించిన అడ్‌హక్ కమిటీని గుర్తించండి.
1) భూపిందర్ సింగ్ బజ్వా చైర్మన్,
ఎంఎం సోమ్యా, బ్రిజ్ భూషణ్
సభ్యులు
2) భూపిందర్ సింగ్ బజ్వా చైర్మన్, మంజూష కన్వర్, ఎంఎం
సోమ్యా సభ్యులు
3) భూపిందర్ సింగ్ బజ్వా చైర్మన్, ఎంఎం సోమ్యా, నిఖల్ జరీన్ సభ్యులు
4) భూపిందర్ సింగ్ బజ్వా చైర్మన్, మంజూష కన్వర్, సాక్షి మాలిక్ సభ్యులు
8. నాంధఫా ఎగిరే ఉడత 42 సంవత్సరాల తర్వాత భారతదేశంలో 2023, డిసెంబర్ 28న ఏ రాష్ట్రంలో కనబడింది.
1) హిమాచల్‌ప్రదేశ్
2) సిక్కిం 3) ఉత్తరాఖండ్
4) అరుణాచల్ ప్రదేశ్
9. 2023 డిసెంబర్లో జరిగిన నియామకాలను జతపరచండి.
ఎ. రాహుల్ రాస్గోత్రా 1. కేంద్ర సాయుధ దళాల రిజర్వ్డ్ డైరక్టర్ జనరల్
బి. నీనా సింగ్ 2. సరిహద్దు భద్రతా దళం డైరెక్టర్ జనరల్
సి. అనీష్ దయాల్ సింగ్ 3. ఇండో-డిబెటన్ బోర్డర్ పోలీసు డెరెక్టర్ జనరల్
డి. వివేక్ శ్రీవాత్సవ 4. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం చీఫ్
5. ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్ &
హోంగార్డ్స్ డైరెక్టర్ జనరల్
1) ఎ-2, బి-3, సి-1, డి-5 2) ఎ-3, బి-2, సి-5, డి-4
3) ఎ-3, బి-4, సి-1, డి-5 4) ఎ-2, బి-3, సి-5, డి-1
10. ప్రపంచంలో స్టీలు ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఎంత?
1) 2వ 2) 3వ
3) 4వ 4) 5వ
11. ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ & టెక్నాలజీ ఇటీవల చేసిన పరిశోధనల్లో కొవిడ్-19తో పాటు ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లను కింది వాటిలో ఏమి తినడం వల్ల రాకుండా ఉంటాయని ప్రకటించింది?
1) కొత్తిమీర 2) పుట్టగొడుగు
3) పచ్చిమిర్చి 4) పన్నీరు
12. 2024, జనవరి 1న నుంచి NPCI అధికారికంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ను ఏ మార్కెట్లలో ప్రవేశపెట్టింది?
1) ప్రాథమిక మార్కెట్
2) ద్వితీయ మార్కెట్
3) బులియన్ మార్కెట్
4) స్పాట్ మార్కెట్
13. కింది వాక్యాలను గమనించి సరైన వాక్యాన్ని గుర్తించండి.
ఎ. ఎంఎస్ స్వామినాథన్ అవార్డును ప్రొ.బీఆర్ కాంబోజ్‌కు ప్రదానం చేశారు
బి. ప్రొ.బీఆర్ కాంబోజ్ చౌదరి చరణ్‌సింగ్ హర్యానా వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్
సి. ‘వన్ హెల్త్ వన్ వరల్డ్’ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని రాజ్‌మాత విజయరాజె సింధియా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో జరిగింది
డి. ప్రొ.బీఆర్ కాంబోజ్‌కు ఈ అవార్డును కర్ణాటక గవర్నర్ ధావర్‌చంద్ గెహ్లట్ అందించారు
1) ఎ, సి, డి 2) బి, సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
14. కింది వాటిలో సరికాని వాక్యమేది?
ఎ. 2024, జనవరి మొదటివారంలో 7వ భారత్-నేపాల్ సంయుక్త కమిషన్ సమావేశం జరిగింది
బి. ఈ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది
సి. ఈ సమావేశానికి భారత్ తరఫున నరేంద్రమోదీ పాల్గొన్నారు
డి. ఈ సమావేశంలో రెండు ఒప్పందాలపై సంతకాలు చేశారు
1) ఎ, బి 2) సి, డి
3) బి, సి 4) ఎ, డి
15. 2023లో భారతదేశంలో జరిగిన 18వ జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా సాధించిన విజయాలు?
ఎ. లాస్, డ్యామేజ్ ఫండ్ ఏర్పాటు
బి. గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్ ఏర్పాటు
సి. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ ఏర్పాటు
డి. పార్టనర్ షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రకటన
1) ఎ, బి, సి, డి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి 4) బి, సి, డి
16. 2023, మార్చి 28-29 తేదీల్లో విశాఖపట్నంలో ఏ జీ20 వర్కింగ్ గ్రూపు సమావేశం జరిగింది?
1) 2వ మౌలిక సదుపాయాల వర్కింగ్ గ్రూపు సమావేశం
2) 1వ మౌలిక సదుపాయాల వర్కింగ్ గ్రూపు సమావేశం
3) 2వ వ్యవసాయ డిప్యూటీల
సమావేశం
4) 1వ పర్యాటక వర్కింగ్ గ్రూపు
సమావేశం
17. SADA TANSEEQ విన్యాసాల గురించి సరైన వాక్యమేది?
ఎ. ఇవి జరగడం ఇదే మొదటిసారి
బి. ఇవి భారతదేశం, సౌదీ అరేబియా దేశాల మధ్య జరిగిన మిలిటరీ విన్యాసాలు
సి. ఇవి రాజస్థాన్‌లోని మహాజన్లో జరిగాయి
డి. భారత్ నుంచి, సౌదీ అరేబియా నుంచి 45 మంది చొప్పున పాల్గొన్నారు
1) ఎ, సి, డి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, సి
18. ఆస్ట్రేలియన్ ఓపెన్-2024 గురించి సరైన వాక్యం?
ఎ. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్ విజేతలు జాన్నిక్ సిన్నర్ & అర్యానా సబలెంకా
బి. పురుషుల డబుల్స్‌ను రోహన్ బోపన్న, మాథ్యూ ఎబ్డెన్ గెలుపొందారు
సి. రోహన్ బోపన్న పురుషుల డబుల్స్ టైటిల్ గెలవడం ఇది రెండోసారి
డి. అతిపెద్ద వయసులో (43 సం.) పురుషుల డబుల్స్ టైటిల్, ప్రపంచ నెంబర్-1 ర్యాంకు సాధించడం ద్వారా రోహన్ బోపన్న రికార్డు సృష్టించాడు
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి
19. 2024, జనవరి 1న విజయవంతంగా ప్రయోగించిన PSLV-C58 రాకెట్ గురించి సరైన వాక్యం?
ఎ. ఇది ఎక్స్పీవో శాట్ ను మోసుకెళ్లింది
బి. ఇది ఖగోళంలో బ్లాక్‌హోల్స్, పాలపుంతలు, ఎక్స్ కిరణాలపై అధ్యయనం చేస్తుంది
సి. ఎక్స్పీవో శాట్‌లో 3 పరికరాలు ఉన్నాయి
డి. ఎక్స్పీవో శాట్ బరువు 469 కిలోలు
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, డి