హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీలో జనవరి 6న ఉర్దూ జాబ్‌మేళా నిర్వహించనున్నారు. తెలంగాణ ఉర్దూ అకాడమీ, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ, సెట్విన్, వీకర్ సెక్షన్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ సొసైటీ సంయుక్తంగా ఈ మేళాను నిర్వహించనున్నాయి.
ఆసక్తి గలవారు జాబ్‌మేళాకు హాజరుకావచ్చని, వివరాలకు 040 – 23237810, 23008413, 35934083 ఫోన్‌నంబర్లలో సంప్రదించాలని ఉర్దూ అకాడమీ కార్యదర్శి డాక్టర్ మహ్మద్‌గౌస్ తెలిపారు. ఉర్దూభాషతోపాటు ఉర్దూ మీడియంలో చదువుకున్నవారికి ఐటీ కంపెనీలు, బ్యాంకింగ్, ఫైనాన్స్, జర్నలిజం, హాస్పిటల్స్, టెలికమ్యూనికేషన్స్ తదితర రంగాల్లో టెక్నికల్, నాన్ టెక్నికల్, ఇంజినీరింగ్, సాఫ్ట్వేర్ తదితర ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు.