న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 6 వరకు అందుబాటులో ఉంటాయి. ఇంటర్, పదో తరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులు. మొత్తం 130 అప్రెంటిస్లను అందిస్తున్నది. ఇందులో మైనింగ్ మేట్, బ్లాస్టర్, వైండింగ్ ఇంజన్ డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం అప్రెంటిస్లు: 130
ఇందులో మైనింగ్ మేట్ 80, బ్లాస్టర్ 20, వైండింగ్ ఇంజన్ డ్రైవర్ 30 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: పదోతరగతి, ఇంటర్ పాసై, 30 ఏండ్లలో వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 6
వెబ్సైట్: www.upenergy.in