TS ICET 2024 | టీఎస్ ఐసెట్-2024 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..!
TS ICET 2024 | ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టీఎస్ఐసెట్- 2024 నోటిఫికేషన్ విడుదలైంది. కాకతీయ యూనివర్సిటీ వైఎస్ ఛాన్స్లర్, టీఎస్ ఐసెట్-24 చైర్మన్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ మంగళవారం విడుదల చేశారు. ఈ నెల 7వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
TS ICET 2024 | ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టీఎస్ఐసెట్- 2024 నోటిఫికేషన్ విడుదలైంది. కాకతీయ యూనివర్సిటీ వైఎస్ ఛాన్స్లర్, టీఎస్ ఐసెట్-24 చైర్మన్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ మంగళవారం విడుదల చేశారు. ఈ నెల 7వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.550, ఇతరులు రూ.750 రుసుం చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.250 అపరాధ రుసుముతో మే 17 వరకు, రూ.500 అపరాధ రుసుముతో మే 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది.
దరఖాస్తులో ఏమైనా తప్పులు, పొరపాట్లు ఉంటే అభ్యర్థులు మే 17వ తేదీ నుంచి 20 తేదీ మధ్య మార్పులు చేసుకోవచ్చు. మే 28వ తేదీ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ప్రవేశ పరీక్ష జూన్ 4వ తేదీన 2 సెషన్లు, 5వ తేదీన ఒక సెషన్ నిర్వహించనున్నారు. జూన్ 15న ప్రాథమిక కీ, జూన్ 16 నుంచి 19 మధ్య అభ్యంతరాల స్వీకరణ, జూన్ 28వ తేదీన ఫైనల్ కీ, ఫలితాలను జూన్ 28వ తేదీన విడుదల చేయనున్నారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
Allu Arjun | చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం రజినీకే సాధ్యం.. ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ ప్రశంసల జల్లు!
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

