ఆత్మనిర్భరతలో ఉత్పత్తి రంగం పాత్ర కీలకం
ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలు
- ప్రజలు జీవనోపాధి కోసం చేపట్టే ఆర్థిక కార్యకలాపాలను మూడు రంగాలుగా విభజిస్థారు.
- ఉత్పత్తి ప్రక్రియలో ప్రకృతి ప్రధాన పాత్ర వహించే వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, అటవీ, గనులకు సంబంధించి పనులు (ప్రాథమిక రంగం)
- యంత్రాలు, పరికరాలు ఉపయోగించి వస్తువులను ఉత్పత్తి చేయడం, ఇతర పరిశ్రమలు (ద్వితీయ రంగం)
- వస్తువులను నేరుగా తయారుచేయకుండా వస్తువుల ఉత్పత్తికి, ప్రజలకు అవసరమైన సేవలు అందించే కార్యకలాపాలు (సేవా లేదా తృతీయ రంగం)
- భారతదేశంలో వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్న వారి వివరాలు
సంవత్సరం వ్యవసాయం పరిశ్రమలు సేవలు
1972-73 74 శాతం 11 శాతం 15 శాతం
2017-18 44 శాతం 25 శాతం 31 శాతం
స్థూల దేశీయోత్పత్తి
- దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తువులు, సేవల విలువను స్థూల జాతీయోత్పత్తి అంటారు
- వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల వారీగా స్థూల జాతీయోత్పత్తి
- ఆర్థికవేత్తలు ఉత్పత్తి అయిన వస్తువుల సంఖ్యను కాకుండా ఆయా వస్తువుల సేవల విలువను డబ్బు రూపంలో లెక్కిస్తారు.
- ఈ విలువను లెక్కించడానికి రెండు రకాల పద్ధతులు అనుసరించవచ్చు.
1. అంతిమ వస్తుసేవలు లెక్కించడం
2. జోడించబడిన అంతిమ విలువను లెక్కించడం - అంతిమ వస్తుసేవలు లెక్కించే విధానంలో దేశీయోత్పత్తి లెక్కించడానికి, అంచనా వేయడానికి అంతిమ వస్తువుల విలువను మాత్రమేతీసుకోవాలి
- ఒక వస్తువు తయారీకి ఉపయోగించిన భౌతిక ఉత్పాదకాల విలువ, ఉత్పత్తిదారుని శ్రమ విలువ చేర్చితే అంతిమ విలువ లభిస్తుంది
- జోడించిన అంతిమ విలువ లెక్కించడంలో ప్రతి దశలో జోడించిన అదనపు విలువను మాత్రమే తీసుకొంటారు.
- దీనికి వస్తువు అమ్మకపు విలువతో అంతకుముందు వేరే వ్యక్తి ఉత్పత్తి చేసిన భౌతిక ఉత్పాదకాల విలువను తీసేయాలి.

- మూడు రంగాల్లో ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో సాధించిన అంతిమ వస్తుసేవల విలువ లేదా ప్రతి దశలో జోడించిన అంతిమ విలువను కలిపితే ఆ దేశ స్థూల దేశీయోత్పత్తి లభిస్తుంది
- దీన్ని ఏప్రిల్ నుంచి మార్చి వరకు కొనసాగే ఆర్థిక సంవత్సర కాలానికి లెక్కిస్తారు
- స్థూల దేశీయోత్పత్తిని గణించడానికి ద్రవ్యపర లావాదేవీలు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు
- వంట చేయడం, ఇళ్లు తుడవటం, పశువులను పోషించడం, పిల్లలను పెంచడం వంటి ద్రవ్యపర లావాదేవీలు లేని కార్యకలాపాలు పరిగణనలోకి తీసుకోరు
- స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల రేటు =

((ప్రస్తుత స్థూల దేశీయోత్పత్తి – గత సంవత్సరపు స్థూల జాతీయోత్పత్తి) / గత సంవత్సరపు స్థూల జాతీయోత్పత్తి ) x 100
భారతదేశంలో స్థూల దేశీయోత్పత్తిలో వివిధ రంగాల వాటా
- వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు అనే మూడు రంగాల ఉత్పత్తి కలిపితే స్థూల దేశీయోత్పత్తి వస్తుంది
- సేవలను మూడురకాలుగా విభజించారు
ప్రజా సామాజిక వ్యవక్తిగత సేవలు – ప్రభుత్వ పాలనాయంత్రాంగం, దేశరక్షణ, విద్య, వైద్యం, ప్రసార మాధ్యమాలు, గ్రంథాలయాలు, పురాతన దస్తావేజుల నిర్వహణ, మ్యూజియం, ఇతర సాంస్కృతిక కార్యకలాపాలు
ఆర్థిక, బీమా, స్థిరాస్థి సేవలు – బ్యాంక్‌లు, పోస్ట్ ఆఫీసులు, పొదుపు ఖాతాలు, బ్యాంకులు కాని ఆర్థిక కంపెనీ, జీవిత బీమా సాధారణ బీమా సంస్థలు, భవన విక్రయ కంపెనీలు, దళారుల సేవలు
వ్యాపారం, హోటళ్లు, రవాణా – రిటైల్ వ్యాపార సంస్థలు, షాపింగ్‌మాల్స్, రెస్టారెంట్లు, స్టార్‌హోటళ్లు, రైలు, రోడ్డు, వాయు రవాణా సేవలు, ఇంటర్నెట్, టీవీ చానళ్లు
- 43 సంవత్సరాల కాలంలో వ్యవసాయరంగం వాటా గణనీయంగా క్షీణించింది
- స్థూల దేశీయోత్పత్తిలో పారిశ్రామికరంగం ఉత్పత్తి వాటా కొంచెం పెరిగింది
- ఇందుకు విరుద్ధంగా సేవా కార్యకలాపాల్లో మూడింట రెండు రంగాల్లో గణనీయమైన వృద్ధి ఉంది
- అభివృద్ధి చెందిన దేశాల్లో ఇదే విధమైన పంథా గమనించవచ్చు.
రంగాల ప్రాముఖ్యతల్లో మార్పు – ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవలు విలువ – ఉపాధి

1. వ్యవసాయ రంగ ప్రాధాన్య దశ
- సాగు పద్ధతులు మార్పు చెంది ఆహారోత్పత్తి పెరుగుతుంది. కొంతమంది వ్యక్తులే అధిక ఉత్పత్తి సాధించగలగడం వల్ల మిగిలిన వారు ఇతర రంగాలకు వెళ్తారు
- వృత్తి పనుల వారు, వ్యాపారులు పెరుగుతారు. పాలకులు పరిపాలనకు, సైన్యానికి చాలామందికి సాయమిస్తారు.
- అయితే ఈ దశలో ఉత్పత్తి అయిన వస్తువులు అధికంగా వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందినవే. చాలామందికి ఈ రంగాల్లో ఉపాధి లభిస్తుంది
2. పరిశ్రమల ప్రాధాన్య దశ
- క్రమంగా ప్రారిశ్రామిక రంగం ప్రాధాన్యతను పొందుతుంది
- నూతన ఉత్పత్తి విధానాలు రావడంతో కర్మాగారాలు ఏర్పడి విస్తరిస్తాయి. వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసేవారికి పెద్ద సంఖ్యలో కర్మాగారాల్లో పని లభిస్తుంది
- కర్మాగారాల్లో చౌక ధరలకు పెద్ద ఎత్తున ఉత్పత్తి కావడం వల్ల ప్రపంచ నలుమూలలున్న మార్కెట్లకు వస్తువులు చేరుతాయి.
- ఈ విధంగా పారిశ్రామిక రంగం ప్రధాన రంగం అవుతుంది
- ఉత్పత్తులు, ఉపాధి దృష్ట్యా వ్యవసాయ రంగం క్షీణిస్తుంది.
3. సేవారంగం ప్రాధాన్య గల దశ
- గత 50 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో పారిశ్రామిక రంగం నుంచి సేవల రంగానికి ప్రాధాన్యత మారుతుంది.
- మొత్తం ఉపాధిలో సేవారంగం ప్రథమ స్థానానికి చేరుతుంది. ఉత్పత్తి కూడా ఇక్కడే అధికంగా ఉంటుంది
- ఉత్పాదక కార్యకలాపాల్లో కూడా అధిక భాగం వస్తువుల ఉత్పత్తి కాకుండా సేవలు అందించడంలో ఉన్నాయి
- ఈ విధంగా పారిశ్రామిక రంగం ప్రధాన రంగం అవుతుంది. ఉత్పత్తులు ఉపాధి దృష్ట్యా వ్యవసాయ రంగం క్షీణిస్తుంది.
- అన్ని అభివృద్ధి చెందిన దేశాల అభివృద్ధిలో కనిపించే రంగాల ప్రాధాన్యత క్రమం
- వ్యవసాయ రంగం – పరిశ్రమల రంగం – సేవల రంగం
భారతదేశంలో వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల్లో ఉపాధి
- ఉపాధి కల్పన, వేతనాలు మొదలైన వాటి ఆధారంగా వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాలుగా విభజించవచ్చు.
వ్యవస్థీకృత రంగం
- ఉపాధి షరతులుండి నమ్మకంగా పని ఉండే ప్రదేశాలు లేదా వ్యాపారాలను వ్యవస్థీకృత రంగం అంటారు
- ఇవి ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకొని ఉంటాయి
- కర్మాగారాల చట్టం, కనీస వేతన చట్టం, దుకాణాలు, సంస్థల చట్టం వంటి వాటిలోగల నియమ నిబంధనలు ఇవి అనుసరిస్తాయి. కొన్ని క్రమబద్ధ ప్రక్రియలు, విధానాలు ఉండటం వల్ల వీటిని వ్యవస్థీకృత రంగం అంటారు
- ఈ రంగంలో కార్మికులకు భద్రత ఉంటుంది. నిర్ధారిత పనిగంటలు ఉంటాయి.
- వేతనంతో కూడిన సెలవు, భవిష్య నిధి, వైద్య సదుపాయాలు, భద్రతా సౌకర్యాలు కల్పిస్తారు
- ప్రభుత్వం, కంపెనీలు, పెద్ద సంస్థల్లో పనిచేసేవారు వ్యవస్థీకృత రంగంలోకి వస్తారు.
అవ్యస్థీకృత రంగం
- అవ్యవస్థీకృత రంగంలో చిన్న చిన్న సంస్థలుంటాయి
- ఇవి ప్రభుత్వ నియంత్రణలో ఉండవు
- నియమ నిబంధనలుంటాయి. కానీ వాటిని అనుసరించరు. అనుసరించేలా చూసేవాళ్లు ఉండరు
- ఉద్యోగులకు జీతం తక్కువ, భద్రత కూడా ఉండదు
- ఎక్కువ పనికి ఎక్కువ వేతనం ఆర్థిక సెలవు, సాధారణ సెలవులు, సిక్ లీవ్‌లు వంటివి కూడా ఉండవు. పని తక్కువగా ఉన్న కాలంలో కొంతమందిని ఉద్యోగం నుంచి తొలగించవచ్చు.
- ఈ రంగంలో కార్మికులు తరచూ దోపిడీకి గురి అవుతుంటారు. ఈ రంగంలో వారికి మరింత పనితోపాటు రక్షణ, మద్దతు అవసరం.
అవ్యవస్థీకృత రంగంలోని వివిధ వర్గాలు – వారికి కల్పించాల్సిన సౌకర్యాలు
గ్రామీణ ప్రాంతం
- ప్రభావిత వర్గం – భూమిలేని వ్యవసాయ కూలీలు, సన్న, చిన్నకారు రైతులు, కౌలుదారులు, చేనేత, కుమ్మరి, వడ్రంగి, కంసాలి
- వారికి కావాల్సిన సౌకర్యాలు – సకాలంలో విత్తనాలు, వ్యవసాయ ఉత్పాదకాలు, రుణ సదుపాయాలు, నిల్వ సౌకర్యాలు అందించాలి. వ్యవసాయ కూలీలకు కనీస కూలి తగినంత పని అందాలి.
పట్టణ ప్రాంతం
- ప్రభావిత వర్గం – చిన్నతరహా పరిశ్రమలు, భవన నిర్మాణం, వ్యాపారం, రవాణాలోని రోజువారీ కూలీలు, బజారుల్లో అమ్మకాలు జరిపేవారు, చిత్తు కాగితాలు ఏరుకునేవారు, బట్టలు కుట్టేవారు
- వారికి కావాల్సిన సౌకర్యాలు – పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ కూలీలకు రక్షణ కావాలి. ముడిసరుకు కొనుగోలుకు, ఉత్పత్తుల అమ్మకానికి చిన్న తరహా పరిశ్రమలకు ప్రభుత్వ మద్దతు ఇవ్వాలి
ఉపాధి – దేశంలో పని పరిస్థితులు
- 2011 జనాభా లెక్కల ప్రకారం 121 కోట్ల జనాభాలో 46 కోట్లమంది పనిచేస్తున్నారు. అంటే వీరందరూ ఉత్పాదక కార్యకలాపాల్లో భాగస్వాములైన ప్రజలు
- ఇప్పటికీ వ్యవసాయమే ప్రధాన ఉపాధి రంగంగా ఉంది. పారిశ్రామిక సేవా రంగంలో తగినంత ఉపాధి కల్పించకపోవడమే దీనికి కారణం
- 1973-74లో ఉపాధి కల్పనలో వ్యవసాయ రంగం 74శాతం, పరిశ్రమల్లో 11 శాతం, సేవలు 15 శాతం వాటా కలిగి ఉన్నాయి.
- దేశంలో కార్మికుల్లో సగం కంటే ఎక్కువ మంది వ్యవసాయ రంగంలో ఉండి జాతీయోత్పత్తిలో ఐదింట ఒక వంతు (19శాతం) ఉత్పత్తికి మాత్రమే దోహదం చేయగలుగు-తున్నారు.
- దీనికి విరుద్ధంగా స్థూల జాతీయోత్పత్తిలో 81 శాతం వాటా కలిగిన పారిశ్రామిక, సేవా రంగాల మొత్తం కార్మికుల్లో దాదాపు సగానికి తరలిపోయినా ఉత్పత్తి ప్రభావితం కాదు
- వ్యవసాయరంగంలో కార్మికులు అల్ప ఉపాధితో ఉన్నారు. అల్ప ఉపాధి అంటే కార్మికులు తమ పూర్తి సామర్థ్యం మేరకు పనిచేయని స్థితి
- పనిలేక నిరుద్యోగిగా ఉంటే అది కనిపిస్తుంది. కానీ అల్ప ఉపాధి ఎవరికీ కనపడదు. దీన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగం అనికూడా అంటారు.
- భారతదేశ వ్యవసాయరంగంలో ప్రచ్ఛన్న నిరుద్యోగులు లక్షల సంఖ్యలో ఉన్నారు. వీరందరూ వేరే రంగాలకు తరలినా వ్యవసాయ ఉత్పత్తి తగ్గదు.

– ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ సౌజన్యంతో..
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

