తెలంగాణ.. ఖనిజశాల
తెలంగాణ.. ఖనిజశాల
ఉత్పత్తి కేంద్రాలు
- పాల్వంచ, ఇల్లెందు, చెందుపల్లి, మణుగూరు, కొత్తగూడెం, పెనగడప, సత్తుపల్లి, తాండూర్, మేడిపల్లి, కాగజ్‌నగర్, ద్రోలి, బెల్లంపల్లి, చెన్నూర్, థిర్యాని, రామగుండం, మంథని, ఖానాపూర్. సనగూడెం, ఇంద్రారాం.
- దేశం మొత్తం బొగ్గు నిల్వల్లో 20 శాతం వరకు మన రాష్ట్రంలో ఉన్నాయి,
అణు ఖనిజాలు
యురేనియం
- యురేనియం ముడి ఖనిజం పిచ్‌బ్లెండ్
- ప్రపంచ యురేనియం ఉత్పత్తిలో భారతదేశ యురేనియం ఉత్పత్తి 2 శాతం మాత్రమే.
- తెలంగాణ ప్రాంతంలో యురేనియం విస్తరించిన ప్రాంతాలు లంబాపూర్, బిట్రియాల్, కుప్పునూర్, పెద్దగట్టు, వనపర్తి, పెద్దూర్, కొత్తూరు.
- నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జిల్లాలో లభ్యమవుతాయి.
- కోరండం, గార్నెట్, గెలీనా, జిర్కోనియం, క్రయోనైట్లు, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.
కొన్ని ఇతర ఖనిజాలు
డోలమైట్
- దీన్ని ఎక్కువగా ఫెర్రో అల్లాయిడ్స్, ఇనుము, కాస్మోటిక్స్ తయారీలో ఉపయోగిస్తారు. విస్తరించిన ప్రాంతాలు ఖమ్మం, జోగులాంబ గద్వాల.
- క్వార్ట్ విస్తరించిన జిల్లాలు నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, హనుమకొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, మేడ్చల్ మల్కాజిగిరి
ఫెల్డ్స్ఫార్
- విస్తరించిన జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, మేడ్చల్- మల్కాజిగిరి, రంగారెడ్డి.
బంకమట్టి
- విస్తరించి ఉన్న జిల్లాలు మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్
లాటరైట్ విస్తరించి ఉన్న జిల్లాలు
- ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ, గద్వాల, వికారాబాద్, రంగారెడ్డి, ములుగు.
స్టోన్మెటల్ విస్తరించి ఉన్న జిల్లాలు
- ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, సిద్ధిపేట, నాగర్ కర్నూల్, సూర్యాపేట, వికారాబాద్.
మైనింగ్
- మైనింగ్‌కు అనువైన ఖనిజాలు రాష్ట్రంలో ఉన్నాయి.
- మైనింగ్, క్వారియింగ్ కార్యకలాపాల కోసం 88,809 హెక్టార్ల భూమిని లీజుకు తీసుకున్నారు.
- రాష్ట్రంలో 1,904 మినరల్ పరిశ్రమలు ఉన్నాయి.
- రాష్ట్రంలో అత్యధిక మినరల్ పరిశ్రమలు గల జిల్లాలు
1) జోగులాంబ గద్వాల (723)
2) ఖమ్మం (463)
3) వికారాబాద్ (234)
4) కుమ్రంభీం ఆసిఫాబాద్ (183) - 2019-20లో రాష్ట్రం మొత్తం ఆదాయంలో మినరల్ ఉత్పత్తి ద్వారా ఆదాయం 37,15.78 కోట్లు
- 2014-15 నుంచి 2019-20 మధ్య రాష్ట్ర మినరల్ రాబడి రూ. 19,776 కోట్లు.
- 2014-15 నుంచి 2019-20లో రూ. 48,48.85 కోట్లు వచ్చింది.
- 2021 నవంబర్ నాటికి ఇసుకను వెలికితీసే 70 ఇసుక బేరింగ్ ప్రాంతాల్లో పని చేయడానికి సిద్ధంగా ఉంది. మరో 100 ఇసుక బేరింగ్ ప్రాంతాలు 2021-22 చివరి వరకు పనిచేశాయి. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు కార్పొరేషన్ ఇసుకను గృహ నిర్మాణం, నీటి పారుదల రంగాలకు సరఫరా చేస్తుంది.
- 2020-21లో ఇసుక తవ్వకాల వల్ల రాష్ట్ర ఖజానాకు రూ. 783.75 కోట్లు వచ్చాయి. వీటితో నేరుగా 5,250 మందికి ఉపాధి కల్పించింది. 2021-22 నవంబర్ వరకు రాష్ట్ర ఖజానాకు 545 కోట్లు ఆదాయం వచ్చింది. ఇందులో మూడింతలు మినరల్ ఫౌండేషన్‌కు వెళుతుంది. ఇది కచ్చితంగా స్థానిక జనాభాకు ప్రయోజనం చేకూర్చడానికి ఉపయోగిస్తారు. ఈ నిధుల ద్వారా స్థానిక ప్రజలకు మౌలిక సదుపాయాలను, పాఠశాలలు, ఆరోగ్య సౌకర్యాలు, మరుగుదొడ్ల సౌకర్యాలను కల్పిస్తుంది.
- అక్రమ ఇసుక తవ్వకాలను పర్యవేక్షించడానికి, అరికట్టడానికి, కొనుగోలు చేసే ఇసుక ధరలను తెలియజేయడానికి, ఇసుక అక్రమ రవాణాను నిరోధించడానికి టీఎస్ఎండీసీ ఇంటిగ్రేటెడ్ కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసింది.
- సాండ్ సేల్స్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ వారు Skoch గ్రూప్ నుంచి 2020 డిజిటల్ ఇండియా గోల్డ్ అవార్డును పొందారు.
- 2020-21 నివేదిక ఆధారంగా గనులు, ఖనిజాల ద్వారా అత్యధిక ఆదాయం లభించిన మొదటి 3 జిల్లాలు : కరీంనగర్, సిద్దిపేట, సూర్యాపేట
- చివరి మూడు జిల్లాలు జోగులాంబ గద్వాల, వనపర్తి, కుమ్రంభీం ఆసిఫాబాద్
- యురేనియం నిక్షేపాలు, నల్లగొండ జిల్లాలోని లంబాపూర్ పులిచెర్ల, నమ్మపురం, ఎల్లాపురం గ్రామాల్లో 11 మెట్రిక్ టన్నుల వరకు ఉన్నాయి.
- యూరేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారికి యూసీఐఎల్ 542 హెక్టార్ల భూమి కేటాయించారు. దీనికి సంబంధించి పర్యావరణ అనుమతులను కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ మంజూరు చేసింది.
- సున్నపురాయి నిక్షేపాలు అధికంగా నల్లగొండ, రంగారెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో కలవు. మొత్తం ఈ జిల్లాల్లో 24 సిమెంట్ ఫ్యాక్టరీలున్నాయి.
- మాంగనీస్ నిక్షేపాలు ఆదిలాబాద్ జిల్లాలో కలవు. ఇక్కడ ఇంతకు ముందు మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ (MOIL)వారు నిక్షేపాలను వెలికి తీశారు. ఇప్పుడు ప్రైవేట్ రంగం వారు నడిపిస్తున్నారు.
- తెలంగాణలోని ఖమ్మం జిల్లాను భూగర్భ ఖనిజ శాలగా పేర్కొంటారు.
- రాష్ట్రంలో అత్యధికంగా యురేనియం నిక్షేపాలు నల్లగొండ జిల్లాలో ఉన్నాయి.
- దక్షిణ భారతదేశంలో బొగ్గు గనుల ద్వారా 10 శాతం బొగ్గు ఉత్పత్తి అవుతుంది.
- ఇనుప ఖనిజాలు, వివిధ రకాల గ్రానైట్ ఖమ్మం జిల్లాలో లభ్యమవుతుంది.
- షాబాద్ బండలను ‘తాండూర్ నీలి సున్నపురాయి’ బండలని అంటారు. ఇవి ఫ్లోరింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇవి రంగారెడ్డి జిల్లాలో కలవు. షాబాద్ బండలు దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత కలిగినవి.
- నైశిక్ గ్రానైట్ అనేది నిజామాబాద్ జిల్లాలో భీంగల్ పరిసర ప్రాంతాల్లో లభ్యమవుతుంది.
- డోలమైట్, డైక్స్ అనేవి ఖమ్మం, వరంగల్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో లభిస్తాయి.
- తెలంగాణలో వివిధ రకాలైన శిలలు, ఖనిజాలు ప్రపంచ వ్యాప్తంగా తెలియడం వల్ల దీన్ని రత్నగర్భ అని పిలుస్తారు.
ప్రధాన పరిశ్రమల్లో
మొదటిస్థానం: గ్రానైట్ కటింగ్ పాలిషింగ్ -36 శాతం
స్టోన్ క్రషింగ్ 23 శాతం
ఇటుక బట్టీలు 12 శాతం
రాతి పలకలు 9 శాతం
కాంక్రిట్ రెడీమిక్స్ 6 శాతం ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ
- మైనింగ్ కార్యకలాపాల ద్వారా ఖనిజ వనరులను అభివృద్ధి చేయడానికి తెలంగాణ రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) బాధ్యత వహిస్తుంది.
- టీఎస్ఎండీసీని గనుల మంత్రిత్వశాఖ 2016లో జాతీయ అన్వేషణ సంస్థగా గుర్తించింది. దీని ద్వారా టీఎస్ఎండీసీ రాష్ట్రం లోపల, రాష్ట్రం వెలుపల ఖనిజాల అన్వేషణ చేయవచ్చు.
జిల్లాలు- లభించే ఖనిజాలు
ఆదిలాబాద్ : మాంగనీస్, సున్నపురాయి, స్టోన్మెటల్, లాటరైట్
మంచిర్యాల: సున్నపురాయి, వైట్ క్లే, మెటల్, బొగ్గు, సాధారణ ఇసుక, స్లోవింగ్ ఇసుక
నిర్మల్: రోడ్ మెటల్, క్వార్ట్
కుమ్రంభీం ఆసిఫాబాద్: సున్నపురాయి, స్టోన్మెటల్, వైట్ క్లే, లాటరైట్
జగిత్యాల : కలర్గ్రానైట్, స్టోన్ మెటల్
పెద్దపల్లి : బొగ్గు, స్టోనింగ్ శాండ్, సున్నపురాయి, రోడ్మెటల్, కలర్ గ్రానైట్, లాటరైట్
రాజన్న సిరిసిల్ల : కలర్ గ్రానైట్, స్టోన్ మెటల్, క్వార్ట్
నిజామాబాద్ : రోడ్మెటల్, క్వార్ట్, కలర్ గ్రానైట్, గ్రాఫైట్
కామారెడ్డి: రోడ్మెటల్, క్వార్ట్, ఫీల్డ్స్ఫార్, లాటరైట్ బ్లాక్ గ్రానైట్
హనుమకొండ: బ్లాక్ గ్రానైట్, స్టోన్ మెటల్, క్వార్ట్, ఐరన్‌ఓర్
వరంగల్ : లాటరైట్, బ్లాక్ గ్రానైట్, స్టోన్ మెటల్, కలర్ గ్రానైట్
జయశంకర్: బొగ్గు, ఐరన్‌ఓర్, రోడ్ మెటల్
జనగామ: రోడ్మెటల్, బ్లాక్ గ్రానైట్
మహబూబ్‌నగర్: బ్లాక్ గ్రానైట్, స్టోన్ మెటల్, లాటరైట్, ఐరన్‌ఓర్, శాండ్, మార్బుల్, బెరైటీస్
ఖమ్మం: డోలమైట్, బెరైటీస్, మైకా, కోరండం, గానైట్, కలర్ గ్రానైట్, బ్లాక్ గ్రానైట్, క్రోమైట్ మార్బుల్, క్వార్ట్, ఫీల్డ్స్ఫార్, స్టోన్మెటల్
భద్రాద్రి కొత్తగూడెం : బొగ్గు, రాగి, తగరం, గార్నెట్, రోడ్మెటల్, క్వార్ట్, ఫీల్డ్స్ఫార్, మార్బుల్
మెదక్: రోడ్మెటల్, క్వార్ట్, ఫీల్డ్స్ఫార్, కలర్ గ్రానైట్
సంగారెడ్డి: క్వార్ట్, ఫీల్డ్స్ఫార్, గ్రానైట్ రోడ్ మెటల్
సిద్దిపేట: కలర్గ్రానైట్, స్టోన్ మెటల్, క్వార్ట్
మహబూబ్‌నగర్: బ్లాక్ గ్రానైట్, కలర్గ్రానైట్, క్వార్ట్, ఫీల్డ్స్ఫార్, రోడ్మెటల్
వనపర్తి: క్వార్ట్, ఫీల్డ్స్ఫార్, బ్లాక్గ్రానూట్, రోడ్మెటల్, సాధారణ ఇసుక
నాగర్‌కర్నూల్: స్టోన్మెటల్, క్వార్ట్, ఫీల్డ్స్ఫార్, బ్లాక్ గ్రానైట్
జోగులాంబ గద్వాల: లాటరైట్, డోలమైట్, కలర్గ్రానైట్, బ్లాక్ గ్రానైట్, రోడ్ మెటల్
నల్లగొండ: క్వార్ట్, ఫీల్డ్స్ఫార్, కలర్ గ్రానైట్, బ్లాక్ గ్రానైట్, రోడ్మెటల్, లైమ్‌స్టోన్, శ్లాబ్స్
సూర్యాపేట: సున్నపురాయి, స్టోన్మెటల్, బ్లాక్‌గ్రానైట్, కలర్గ్రానైట్, పున్నపురాయి, శ్లాబ్స్
యాదాద్రి భువనగిరి: రోడ్మెటల్, కలర్గ్రానైట్, సాధారణ ఇసుక
వికారాబాద్: పుల్లర్స్, ఎర్త్, క్వార్ట్, స్టోన్మెటల్, లాటరైట్, సున్నపురాయి, బ్లాక్ గ్రానైట్
మేడ్చల్- మల్కాజిగిరి: రోడ్మెటల్, బ్లాక్కలర్ గ్రానైట్, క్వార్ట్, ఫీల్డ్స్ఫార్, ఎమ్థెస్ట్
రంగారెడ్డి : రోడ్మెటల్, లాటరైట్, ఫీల్డ్స్ఫార్, క్వార్ట్, బ్లాక్ గ్రానైట్, పుల్లర్స్ ఎర్త్
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

