31 వరకు టీఎస్ ఈసెట్ ఆన్లైన్ దరఖాస్తు గడువు పొడిగింపు
టీఎస్ ఈసెట్| తెలంగాణ ఈ సెట్–21 ఆన్లైన్ దరఖాస్తు గడువును మరోమారు పొడిగించారు. కరోనా నేపథ్యంలో ఈ నెల 31 వరకు విద్యార్థులకు అప్లయ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు టీఎస్ ఈ సెట్ కన్వీనర్ సీహెచ్.వెంకటరమణారెడ్డి తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణ ఈ సెట్–21 ఆన్లైన్ దరఖాస్తు గడువును మరోమారు పొడిగించారు. కరోనా నేపథ్యంలో ఈ నెల 31 వరకు విద్యార్థులకు అప్లయ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు టీఎస్ ఈ సెట్ కన్వీనర్ సీహెచ్.వెంకటరమణారెడ్డి తెలిపారు. షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు గడువు ఈనెల 18న ముగిసింది. అయితే రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను నిలువరించడానికి ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దీంతో ఎలాంటి అపరాధ రుసుము లేకుండా మే 24 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. కాగా, నేటితో ఆ గడువు ముగియడంతో మరోమారు పొడిగించారు.
ఈ పరీక్ష ద్వారా ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ మ్యాథ్స్ కోర్సులు చేస్తున్నవారికి బీటెక్ సెకండియర్లోకి ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షను TSCHE తరఫున జేఎన్టీయూ నిర్వహిస్తున్నది.
దరఖాస్తు ఫీజు: రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400
వెబ్సైట్: ecet.tsche.ac.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

